ఓటుకు నోటు కేసుతో దగ్గరైన ఖాకీలు... అలా సంబంధం... విడాకులు తీస్కుని పెళ్లి...
ఏసీబీ ఏఎస్పీగా పనిచేస్తున్న మహిళా అధికారి, సీఐ మల్లికార్జున రెడ్డి మధ్య సాగుతున్న వివాహేతర సంబంధం ఎలా మొదలైందన్న దాని గురించి పలు ప్రచారాలు సాగుతున్నాయి. వీరిద్దరూ ఓటుకు నోటు కేసులో కలిసి పని చేశారట. ఆ క్రమంలోనే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్
ఏసీబీ ఏఎస్పీగా పనిచేస్తున్న మహిళా అధికారి, సీఐ మల్లికార్జున రెడ్డి మధ్య సాగుతున్న వివాహేతర సంబంధం ఎలా మొదలైందన్న దాని గురించి పలు ప్రచారాలు సాగుతున్నాయి. వీరిద్దరూ ఓటుకు నోటు కేసులో కలిసి పని చేశారట. ఆ క్రమంలోనే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసిందట. దీన్ని మొదట్లోనే గమనించిన మహిళా అధికారిణి భర్త పైఅధికారులకు ఫిర్యాదు చేశాడట. దీనితో వారిద్దరినీ మందలించి ఏసీబీలో పనిచేస్తున్న మల్లికార్జున రెడ్డిని సివిల్ పోలీసు శాఖకు బదిలీ చేశారట.
ఐనప్పటికీ వారిద్దరిలో మార్పు రాలేదు. ఇద్దరూ తరుచూ రాత్రివేళల్లో కలుసుకుంటూ వుండటాన్ని ఏఎస్పీ భర్త తరపు బంధువులు గమనించి విషయాన్ని అతడికి చేరవేశారు. దానితో ఆదివారం నాడు పక్క ప్రణాళికతో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే మల్లికార్జున రెడ్డి మరో వాదన చేస్తున్నారు. ఏఎస్పీ అధికారిణి విడాకులకు అప్లై చేశారనీ, విడాకులు రాగానే తామిద్దరం పెళ్లి చేసుకోనున్నామని చెపుతున్నారు. ఆమెతో గత ఐదేళ్లుగా తనకు పరిచయం కూడా వున్నదని అతడు చెప్పడం గమనార్హం. మరి మల్లికార్జున రెడ్డి మాటలపై పైఅధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.