Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసులకు దొరికిపోయిన కాయ్ రాజా కాయ్ రోహిత్!

Advertiesment
Actor
, ఆదివారం, 5 జూన్ 2016 (18:22 IST)
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెలెబ్రిటీలు చిక్కడం కొత్తేమీ కాదు. తాజాగా ఈ కేసులో యువ నటుడు సాయి రోహిత్ పట్టుబట్టాడు. హైదరాబాద్ జూబ్లి హిల్స్‌లో శనివారం అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో రోహిత్ పాజిటివ్‌ తేలడంతో దొరికిపోయాడు. తాగి డ్రైవ్ చేస్తున్న సాయి రోహిత్ ని పోలీసులు ఆపి బ్రీథ్ ఎనలైజర్‌తో పరీక్షించగా, తాగినట్లు తేలిపోయింది.
 
దీంతో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు. ఇత‌నితో పాటు అనేక మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప‌ట్టుబ‌డ‌టంతో వీరంద‌రికి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వ‌నున్నారు. కాయ్ రాజా కాయ్ సినిమాలో రోహిత్ నటించిన సంగతి తెలిసిందే. వీకెండ్‌ పార్టీల్లో భాగంగా రోహిత్ పోలీసులకు దొరికిపోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా రెచ్చగొడుతుందమ్మా.. ఎవరూ ఆవేశానికి గురికావొద్దమ్మా..!: చినబాబు ట్వీట్