Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేటకొడవలితో ఆటోడ్రైవర్‌పై దాడి.. భార్యతో సన్నిహితంగా వున్నాడని?

Advertiesment
murder
, మంగళవారం, 1 ఆగస్టు 2023 (14:02 IST)
వివాహేతర సంబంధం కారణంగా ఆటో డ్రైవర్‌పై వేటకొడవలితో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆటో డ్రైవర్‌తో తన భార్య సన్నిహితంగా వుండటం చూసి అనుమానం పెంచుకున్న భర్త.. ఓ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్‌పై వేట కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఖానాపురంకు చెందిన ఏ నాగరాజు, సతీష్ మంచి స్నేహితులు. నాగరాజు తన భార్యతో కలిసి రైతు బజార్‌లో కూరగాయలు విక్రయిస్తుండగా.. సతీష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 
 
నాగరాజుతో ఆమె భార్యతోనూ సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో నాగరాజు, తన భార్య- సతీష్ మధ్య వున్న సాన్నిహిత్యంపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య నుంచి దూరంగా వుండాలని హెచ్చరించాడు. అయినా ఇద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు. 
 
అంతే నాగరాజు వేట కొడవలితో సతీష్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన సతీష్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీఎస్‌టీయూ సెట్‌కు కొత్త షెడ్యూల్.. ఆగస్టు 8, 9 తేదీల్లో..