Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ బిల్డింగ్‌కు మంచు విష్ణు మంగళంపాడేనా! తాజా అప్‌డేట్‌!

MAA comity
, మంగళవారం, 1 ఆగస్టు 2023 (13:46 IST)
MAA comity
మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సభ్యులకు ఇచ్చిన హామీలు పెద్దగా నెరవేరలేపోయాయి. ఆయన 2021 అక్టోబర్‌లో ‘మా’కు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ముందుగా పేదకళాకారులను ఫించన్‌ రూపంలో ఆదుకోవడంతోపాటు అసోసియేషన్‌ బిల్డింగ్‌ను గతంలోని కమిటీ చేయలేనిది తాను చేస్తాననీ హామీ ఇచ్చారు. అటు ప్రభుత్వపరంగా సహకారంకూడా తీసుకుంటాననీ, అవసరమైతే తానే స్వంత డబ్బులతో అసోసియేషన్‌ బిల్డింగ్‌ ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యానించారు. చూస్తుండగానే కాలం తిరిగింది. 2023 ఆగస్టు నెల వచ్చేసింది. రెండేళ్ళ కాలపరిమితి దగ్గరపడుతోంది.
 
తాజాగా ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం ఇటీవలే ‘మా’ కార్యాలయం సమీపంలోనే జరిగింది. సభ్యులు బాగానే హాజరయ్యారు. అయితే అందులో ముఖ్యంగా బిల్డింగ్‌ గురించి చర్చ వచ్చింది. చాలామంది సభ్యులు మంచు విష్ణు హామీ ఇచ్చినట్లు స్వంతంగా కడితే మరోసారి ఎన్నికలకోసం స్వలాభంకోసం చేస్తున్నారనే ప్రశ్న ఎదురైంది. దాంతో అటు మంచు విష్ణు ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా అపనిందపడకుంటా చూసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న ఫిలింఛాంబర్‌లోని ‘మా’ కార్యాలయాన్ని అలాగే కొనసాగించడమా, లేక మరోచోట అద్దెకు తీసుకోవడమా! అనే విషయంలో క్లారిటీ రాలేదు. 
 
దీనికి తోడు ఫిలింఛాంబర్‌ అధ్యక్ష ఎన్నికలు అదేరోజు జరగడం దానికి దిల్‌రాజు అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో అదే కాంపౌండ్‌లో వున్న మా కార్యాలయాన్ని ఏమి చేస్తారనే ప్రశ్న కూడా తలెత్తింది. దీనిపై దిల్‌రాజుతోపాటు ఛాంబర్‌లోని 4సెక్టార్ల కమిటీతో మంచు విష్ణు త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇదిలా వుండగా, బిల్డింగ్‌ విషయంలో తాము ఇచ్చినమాటకు కట్టుబడి వున్నామనీ, ఏమిచేయాలో సభ్యులు తెలియజేయాలని ప్రస్తుతం లండడ్‌లో వున్న మంచు మోహన్‌బాబు సభ్యులకు సూచించినట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలోనే మా ఎన్నికలు జరగాల్సి వున్నాయి. ఈసారి ఎలాంటి హడావుడి జరుగుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ప్లజంట్ పోస్టర్ తో హాయ్ నాన్న టీమ్ శుభాకాంక్షలు