Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24 గంటల్లోనే 25 ప్రసవాలు- జగిత్యాల వైద్యుల రికార్డ్

Doctors

సెల్వి

, బుధవారం, 16 అక్టోబరు 2024 (22:27 IST)
జగిత్యాల జిల్లాలో బుధవారం 24 గంటల్లోనే 25 ప్రసవాలు చేసి మదర్ అండ్ చైల్డ్ హెల్త్‌కేర్ (ఎంసీహెచ్) కేంద్రంలోని వైద్యులు రికార్డు సృష్టించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు ఆధ్వర్యంలో నర్సుల సహకారంతో డాక్టర్ అరుణ సుమన్ నేతృత్వంలో ఇద్దరు ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్లతో సహా ఆరోగ్యశాఖ అధికారుల బృందం ప్రసవాలు నిర్వహించారు. 25 ప్రసవాల్లో 13 నార్మల్ డెలివరీలు కాగా.. 12 సి-సెక్షన్ సర్జరీలు చేశారు. 
 
ఎంసీహెచ్‌లో నాణ్యమైన వైద్యసేవలు అందించడం వల్ల చాలా మంది గర్భిణులు ప్రసవాల కోసం ఆస్పత్రికి వస్తున్నారని డాక్టర్ రాములు తెలిపారు. మొత్తం 25 మంది మహిళలు ఎటువంటి తీవ్రమైన సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిచ్చారు. ఎంసీహెచ్‌ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 
 
ఆగస్టులో దాదాపు 300 ప్రసవాలు జరగ్గా, సెప్టెంబరులో వాటి సంఖ్య దాదాపు 400కు చేరుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ఒకేరోజు 25 ప్రసవాలు చేసి రికార్డు సాధించేందుకు వైద్యులు, టీమ్ సభ్యుల కృషిని డాక్టర్ రాములు కొనియాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Redmi 13C 5Gపై భారీ డిస్కౌంట్.. ధర రూ.8,999లకే లభ్యం