Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ బదిలీపై ఉత్కంఠ... సీఎంను కలిసి విజ్ఞప్తి..

srijana

ఠాగూర్

, శనివారం, 12 అక్టోబరు 2024 (10:13 IST)
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనను బదిలీ చేసే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణా కేడర్‌కు చెందిన ఆమెను.. కేంద్రం ఈ నెల 16వ తేదీలోపు స్వరాష్ట్రంలో రిపోర్టు చేయాలంటూ ఆదేశించింది. దీంతో ఆమెపై బదిలీ పేటు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదేసమయంలో కొత్త కలెక్టర్ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన కొనసాగుతున్నారు. అయితే, తెలంగాణా రాష్ట్రానికి చెందిన సృజన స్వరాష్ట్రం తెలంగాణకు వెళ్లాల్సిందనంటూ ఇటీవల డీఓపీటీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
పైగా, ఈ నెల 16వ తేదీలోగా తెలంగాణ రాష్ట్రంలో రిపోర్టు చేయాల్సి ఉంది. దీంతో కొత్త కలెక్టర్‌ ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రా క్యాడర్‌లోనే కొనసాగేందుకు ఐఏఎస్‌ అధికారిణి జి.సృజన ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించనున్నట్లు తెలిసింది. స్టే ఉత్తర్వులు పొందేందుకు అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అదేసమయంలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తనను ఏపీలోనే ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేయగా, కేంద్రంతో మాట్లాడుతానంటూ హామీ ఇచ్చినట్టు సమాచారం. 
 
2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికారుల కేటాయింపులో భాగంగా సృజనను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. 2013-14 బ్యాచ్‌కు చెందిన ఆమె శాశ్వత నివాసం హైదరాబాద్‌గా ఉండటంతో ఆమెకు అక్కడ కేటాయించారు. దీనిని ఆమె వ్యతిరేకిస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్‌ బలరామయ్య కుమార్తె అయిన సృజన.. పాఠశాల విద్య కడపలో సాగింది. డిగ్రీ, ఉన్నత విద్య హైదరాబాద్‌లో అభ్యసించారు. పీహెచ్‌డీ ఎస్వీయూలో పూర్తి చేశారు. విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 
 
విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసి 2023లో ఏప్రిల్‌లో తన తండ్రి పనిచేసిన జిల్లా కర్నూలు కలెక్టర్‌గా వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే జూన్‌ 26న ఎన్టీఆర్‌ జిల్లాకు వచ్చారు. తెలంగాణకు కేటాయించడంపై శుక్రవారం సీఎం చంద్రబాబును కలిసి వివరించినట్లు తెలిసింది. మరోవైపు, ఎన్టీఆర్‌ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త వేధింపులు.. పెళ్లయిన 8 నెలలకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మణం