Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హస్తినకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

revanth reddy
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (12:34 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో ఇతర పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతారు. వారితో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు. 
 
అలాగే, వచ్చే యేడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై కూడా చర్చిస్తారు. పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీర్మాన కాపీని పార్టీ అధ్యక్షుడు ఖర్గేతు అందించనున్నారు. ఈ పర్యటన పూర్తి చేసుకుని ఆయన తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లభిస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 

టీడీపీ నేత సోమిరెడ్డి దీక్షా శిబిరంపై హిజ్రాలతో దాడి.. వైకాపా నేతల అరాచకం... 
 
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షా శిబిరంపై అధికార వైకాపా నేతలు హిజ్రాలతో దాడి చేయించారు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో అక్రమ మైనింగ్‌ తవ్వకాలను అడ్డుకోవాలని కోరుతూ ఆయన గత రెండు రోజులుగా నిరాహారదీక్ష చేపట్టారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొత్త ట్రెండ్ తెచ్చారు. అక్రమాలను ప్రశ్నించే వారిపై హిజ్రాలను ఉసిగొలిపి అవమానకరరీతిలో విపక్ష నేతలను శారీరకంగా, మానసికంగా హింసించే కొత్త విధానానికి తెరలేపారు. 
 
పొదలకూరు మండలంలో రుస్తుం క్వారీ నుంచి మంత్రి కాకా అండదండలతో ఆయన అనుచరులు రూ.కోట్ల తెల్లరాయిని తరలిస్తున్నారని ఆరోపిస్తూ సోమిరెడ్డి 'సత్యాగ్రదీక్ష' పేరుతో 16 నుంచి ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా క్వారీ వద్దే దీక్షకు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి మూడు రోజులుగా రేయింబవళ్లు క్వారీ వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే, కోట్లాది రూపాయల ప్రజా సంపదను అక్రమంగా కొల్లగొట్టుకొని పోతున్నారని ఆరోపిస్తుంటే.. ఈ విషయం మీడియాలో ప్రధాన వార్తాంశాలుగా చక్కర్లు కొడుతున్నా.. మూడు రోజులుగా ఒక్క అధికారి కూడా ఆ క్వారీ వైపు కన్నెత్తి చూడలేదు. 
 
ప్రతి పక్ష నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అధికారులు ప్రతినిధులుగా ప్రభుత్వ శాఖల గుమాస్తాలు కూడా అటు వైపు తిరిగి చూడలేదు. కానీ, ఈ విషయంతో ఏమాత్రం సంబంధ లేని హిజ్రాలు మాత్రం సోమవారం ఒక హైటెక్ బస్సు వేసుకొని మరీ క్వారీ వద్దకు వచ్చారు. 
 
ఒకరిద్దరు కాదు.. సుమారు 80 మంది వరకు హిజ్రాలు క్వారీ వద్దకు చేరుకున్నారు. క్వారీకి కొంత దూరంలోనే బస్సు దిగి వారి శైలిలో తిట్టి పోసుకొంటూ దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. సోమిరెడ్డితో పాటు టీడీపీ నేతలను దూషిస్తూ, వారిపై దాడికి తెగబడేందుకు ప్రయత్నించారు. అయితే, తెలుగు తమ్ముళ్లు తిరగబడటంతో హిజ్రాలు పారిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడును ముంచెత్తిన వరదలు - రైళ్లలోనే 800 మంది ప్రయాణికులు