ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్‌లో తన జోక్యం ఏమీ ఉండదు అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్‌లో యుద్ధం చేశాడా అంటూ మాట్లాడారు. సినిమాలో డబ్బులు పెట్టాడు సంపాదించుకున్నారు. రూల్సును అధిగమిస్తే "తగ్గేదెలే"దని రేవంత్ అన్నారు.
డబ్బున్నోడయిన, పేదోడయిన, సెలబ్రెటి అయినా, అభిమానైనా ప్రజా పాలన చట్టానికి అందరూ సమానమేని రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా చూడాలనుకుంటే ప్రత్యేకంగా షో వేసుకుని చూడవచ్చు. ఇంట్లో హోం థియేటర్‌లో చూడొచ్చు. అంతేగానీ ఇలా బహిరంగ ప్రదేశాలు సెలెబ్రిటీలు కనిపించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదని రేవంత్ అన్నారు.