Publish Date: Sat, 18 May 2024 (12:54 IST)
Updated Date: Sat, 18 May 2024 (12:56 IST)
మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుకమేటలు, రాళ్లను తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది.
ఈ క్రమంలో మేడిగడ్డ బ్లాక్-7లోని 8 గేట్లను ఎత్తివేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. 8 గేట్లలో ఒక గేటును ఇప్పటికే ఎత్తి పెట్టారు. 2 గేట్లు మినహా మిగిలిన గేట్లను సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశం ఉందని ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు.