Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైడ్రాపై కేఏ పాల్‌ పిటిషన్‌.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ka paul

ఠాగూర్

, శుక్రవారం, 4 అక్టోబరు 2024 (13:31 IST)
హైదారాబాద్ నగర పరిరక్షణ నిమిత్తం భాగ్యనగరిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జీవో 99పై స్టే విధించాలని.. కూల్చివేతలను తక్షణమే ఆపేయాలని కేఏ పాల్‌ వాదనలు వినిపించారు. ఇప్పటికప్పుడు కూల్చివేతలు ఆపలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. 
 
హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని.. అక్రమ కట్టడాల కూల్చివేతలకు నెలరోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషన్‌ కోరారు. అనంతరం ప్రతివాదులుగా ఉన్న హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 14కి వాయిదా వేసింది. 
 
మూసీ నది బాధితులంతా బుల్డోజర్లతో వెళ్లి సీఎం రేవంత్ ఇంటిని కూల్చేస్తాం 
 
హైదరాబాద్ నగర పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులోభాగంగా, అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేతల విషయంలో దూకుడు ప్రదర్శిస్తుంది. ఇపుడు మూసీ నది పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ నది గట్టున ఉన్న ఇళ్ళను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో బాధితులు బోరుమని ఏడుస్తున్నారు. 
 
దీనిపై ఓ బాధితురాలు మాట్లాడుతూ, "35 ఏండ్ల నుండి ఇక్కడ ఉంటున్నాం.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. రేవంత్ రెడ్డి అసలు సీఎం లాగా మాట్లాడుతున్నాడా? లక్ష మంది మూసీ బాధితులం జేసీబీలు తీస్కొని రేవంత్ రెడ్డి ఇంటి మీదకు పోతాం. ఎంత మంది మీద కేసులు పెడతారు.. రేవంత్ రెడ్డిని సంపడానికి అయినా సావడానికి అయినా సిద్ధం. మాది అక్రమ ఇల్లు అంటే చెప్పు తీసుకొని కొడతాం. హైదరాబాద్ చెత్త మొత్తం పోసే జవహర్ నగర్ చెత్త కుప్పలో మమ్మల్ని ఉండమంటవా. రూపాయి రూపాయి జమ చేసి కట్టుకొని ఇల్లు వదిలేసి ఆ చెత్త కుప్పలో మేమెందుకు ఉండాలి.. రేవంత్ రెడ్డినే అక్కడ ఉండమనండి. ఎవడొచ్చి ఇల్లు కూలుస్తాడో అని నిద్ర పట్టట్లేదు. రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుండి దింపెస్తాం'' అని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల లడ్డూ కల్తీ వివాదం : స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం