Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

corruption

ఐవీఆర్

, శనివారం, 30 నవంబరు 2024 (18:09 IST)
తెలంగాణలో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. ఇప్పటికే సస్పన్షన్ వేటు పడిన ఏఈ నిఖేష్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి వున్నట్లు ఫిర్యాదు అందటంతో ఆయనకు సంబంధించిన ఆస్తులపై తెలంగాణ ఏసీబి అధికారులు సోదాలు చేపట్టారు.
 
బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా అనేక అనుమతులను ఇచ్చిన నిఖేష్ అందుకు ప్రతిఫలంగా భారీగా ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అందినకాడికి అక్రమార్జన చేసినట్లు తేలింది. ఏసీబి సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. 5 ప్లాట్లు, ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ఓపెన్ ఫ్లాట్స్, రెండు కమర్షియల్ స్పేసుకి సంబంధించి డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 200 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు చెబుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్