Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఇద్దరు తెరాస నేతలకు 'సన్ స్ట్రోక్'... అందుకే ఓడారా?

ఆ ఇద్దరు తెరాస నేతలకు 'సన్ స్ట్రోక్'... అందుకే ఓడారా?
, మంగళవారం, 11 డిశెంబరు 2018 (15:35 IST)
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ హవా కొనసాగితే రెండు చోట్ల మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. దీనికి కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు నేతలు. భూపాలపల్లి.. ములుగుల్లో టిఆర్ఎస్ ఓటమికి వారి కొడుకులే కారణం అనే విశ్లేషణ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ హవా కొనసాగింది. 12 నియోజకవర్గాలకు గాను 10 చోట్ల టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
 
రెండుచోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. కాంగ్రెస్ గెలిచిన రెండు చోట్ల టిఆర్ఎస్ ఎందుకు ఓటమి చెందింది అనే చర్చ మొదలైంది. ఓటమికి గల కారణాలపై అప్పుడే విశ్లేషణ మొదలైంది. ఇంత హవాలోను భూపాలపల్లి ములుగులో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణాలను విశ్లేషణ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల కూడా టిఆర్ఎస్ అభ్యర్థులపైన మంచి అభిప్రాయమే ఉన్నా వాళ్ల కొడుకులు తీరు కారణంగానే ఓడిపోయి ఉంటారని టిఆర్ఎస్ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.
 
చందూలాల్, మదూసుధనాచారి ఇద్దరు సన్ స్ట్రోక్ కారణంగా ములుగు.. భూపాలపల్లిలో ఓటమిపాలై ఉంటారని గట్టిగా వాదిస్తున్నారు. చందులాల్ అనారోగ్యం కూడా ఓటమికి కారణం అనే అంచనాకు వచ్చారు.

 
దీనికితోడు భూపాలపల్లి నియోజకవర్గంలో రాహుల్ గాంధీ సభతో పాటు రమణారెడ్డి సీతక్కలపై ఉన్న పాజిటివ్ థింక్స్ వల్ల కూటమి గెలుపుకి కారణమై ఉంటుందని, డబ్బులు ఖర్చు చేయడంలో ఈ ఇద్దరు నేతలు ఎక్కడ వెనకకు తగ్గకపోవడం కూడా వారి గెలుపుపై ప్రభావం చూపించిందని రాజకీయ నాయకులు విశ్లేషణ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు సలహాతోనే లగడపాటి మైండ్ గేమ్ ఆడారా?