కొబ్బరిపాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కొబ్బరితో చేసిన స్వీట్స్ అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కొబ్బరి పాలలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు కొబ్బరిని ఉపయోగించి కొబ్బరి బర్ఫీ ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు :
కొబ్బరితురుము- 2 కప్పులు,
పాలు-3 కప్పులు,
మీగడ-అర కప్పు,
కుంకుమపువ్వు-కొద్దిగా,
పంచదార- 400గ్రా,
యాలకుల పొడి-అరటీ స్పూన్,
తయారు చేసే విధానం...
పాన్‌లో పాలు, కొబ్బరి తురుము, మీగడ, పంచదార వేసి కలుపుతూ చిన్న సెగపై ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక యాలకుల పొడి, టీ స్పూన్ పాలల్లో కలిపిన కుంకుమపువ్వు వేసి కలిపి దించి నెయ్యి రాసిన ప్లేటులో వేసి, అట్లకాడతో సమంగా సర్దేసి ఆరాక ముక్కలుగా కోయాలి. అంతే... టేస్టీ కొబ్బరి బర్ఫీ రెడీ.