Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్‌ను చిన్నచూపు చూశా .. అది నన్ను చంపేసింది.. ఫిట్నెస్ స్టార్

Advertiesment
కరోనా వైరస్‌ను చిన్నచూపు చూశా .. అది నన్ను చంపేసింది.. ఫిట్నెస్ స్టార్
, సోమవారం, 19 అక్టోబరు 2020 (12:22 IST)
తనలాగా ఫిట్‌గా ఉంటే కరోనా ఏంటి.. దాని జేజేమ్మ కూడా మన దరికి చేరదంటూ ప్రచారం చేసిన ఫిట్నెస్ స్టార్.. ఎంత మందికి ఫిట్నెస్ ఇన్‌ఫ్లుయన్సర్‌గా ఉన్న సెలెబ్రిటీ దిమిత్రి స్టుజుక్.. చివరకు ఆ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోవడం ఇపుడు ఆయన అభిమానులను కంటతడిపెట్టిస్తోంది. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్... శారీరకంగా పూర్తి ఫిట్‌గా ఉన్న వారిదరికి కూడా చేరదని, ఒకవేళ వైరస్ సోకినా, చాలా సులువుగా కోలుకోవచ్చని దిమిత్రి తొలుత విస్తృతంగా ప్రచారం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఫిట్నెస్‌గా ఉండేదుకు ప్రయత్నించాలంటూ కోరారు. 
 
అయితే, ఇటీవల టర్కీలో పర్యటించిన ఆయన, తీవ్రమైన కడుపునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడి, తన దేశానికి వచ్చిన తర్వాత, పరీక్షలు చేయించుకోగా, కరోనా సోకిందని వైద్యులు నిర్దారించారు. ఆపై ఆసుపత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జ్ కూడా అయ్యారు.
 
ఇంతవరకు బాగానేవుంది. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఉన్నట్టుండి విషమించింది. దీంతో మరోమారు ఆస్పత్రిలో చేరారు. ఇన్ పేషెంట్‌గా చికిత్స తీసుకుంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. 
 
తనకు కరోనా వచ్చేంత వరకూ ఇటువంటి ఓ వ్యాధి ఉందని తాను నమ్మలేదన్నాడు. ఈ వైరస్ చాలా బలమైందని, ఇప్పట్లో ప్రపంచాన్ని విడిచి పోదని, అంతం కాబోదని వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. అవే అతని చివరి మాటలు అయ్యాయి. కరోనా అతని ప్రాణాలు తీసింది. 
 
కాగా, 33 యేళ్ల దిమిత్రి ప్రపంచలో ఫిట్నెస్ ఇన్‌ఫ్లూయన్సర్‌గా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో దాదాపు 11 లక్షల మందికి పైగా ఫాలోవర్స్‌ను కలిగిన ఈ సెలెబ్రిటీ తన వీడియోలతో ఎంతో మందికి ప్రేరణగా నిలిచాడు. 
 
అటువంటి దిమిత్రి, కరోనా సోకి కన్నుమూసి, తన అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చారు. స్టుజుక్ మరణ వార్తను ఆయన మాజీ భార్య సోఫియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టం చేసింది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ్యాచ్ ముగింపులో పరమ చెత్తగా ఆడుతున్నాం.. ఇక ఏం మాట్లాడను : డేవిడ్ వార్నర్