Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌- సింధుకు పతకం ఖాయం.. సైనా ఓటమి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు సెమీఫైనల్లోకి చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు అదరగొట్టింది. ఈ క్రమంలో ప్రపంచ మూడో

Advertiesment
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌- సింధుకు పతకం ఖాయం.. సైనా ఓటమి
, శనివారం, 4 ఆగస్టు 2018 (10:56 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు సెమీఫైనల్లోకి చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు అదరగొట్టింది. ఈ క్రమంలో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు.. ఆరో ర్యాంకర్ ఒకహరను ఓడించింది. హోరాహోరీ పోరులో సింధు 21-17, 21-19తో ఒకుహరపై విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక శనివారం జరిగే సెమీఫైనల్లో అకానే యమగుచితో సింధు తలపడనుంది.
 
మరోవైపు ఇదే టోర్నీలో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు ఓటమిని చవిచూసింది. క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ 6-21, 11-21తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో పరాజయం చవిచూసింది.
 
ఇకపోతే.. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌ 12-21, 12-21తో ఆరో సీడ్‌ కెంటొ మొమొట (జపాన్‌) చేతిలో ఖంగుతిన్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- అశ్విని పొన్నప్ప 17-21, 10-21తో జెంగ్‌ సీవీ- హువాంగ్‌ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకనైనా నమ్మండి.. షమీ మోసం చేస్తున్నాడు.. భార్య హసీన్ జహాన్