Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అదే దూకుడు కనబరిచిన సెన్సెక్స్, 55 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

అదే దూకుడు కనబరిచిన సెన్సెక్స్, 55 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
, శుక్రవారం, 3 జులై 2020 (22:33 IST)
బెంచిమార్కు  సూచీలు వరుసగా మూడవ రోజు కూడా సానుకూల చలనాన్ని కొనసాగించాయి. నిఫ్టీ 0.53% లేదా 55.65 పాయింట్లు పెరిగి 10,607.35 వద్ద ముగిసింది, 10 వేల మార్కు పైన నిలిచి ఉంది. మరోవైపు, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 0.50% లేదా 177.72 పాయింట్లు పెరిగి 36,021.42 వద్ద ముగిసింది. సుమారు 1333 షేర్లు పెరిగాయి, 148 షేర్లు మారలేదు, 1359 షేర్లు క్షీణించాయి.
 
భారతి ఎయిర్‌టెల్ (4.08%), ఐషర్ మోటార్స్ (4.18%), అదానీ పోర్ట్స్ (4.12%), హీరో మోటోకార్ప్ (2.64%), బజాజ్ ఆటో (1.93%) నిఫ్టీ లాభాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. జెఎస్‌డబ్ల్యు స్టీల్ (1.77%), టాటా స్టీల్ (1.76%), ఇండస్ఇండ్ బ్యాంక్ (1.48%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.28%), జీ ఎంటర్టైన్మెంట్ (1.35%) నిఫ్టీ నష్టపోయిన వాటిలో అగ్రస్థానంలో ఉన్నాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ 0.56 శాతం, బిఎస్ఇ స్మాల్‌క్యాప్ 0.47 శాతం పెరిగాయి. బ్యాంక్ మరియు లోహం మినహా అన్ని రంగాలు సానుకూలంగా వర్తకం చేశాయి. 
 
మదర్సన్ సుమి సిస్టమ్స్ లిమిటెడ్.
ఆటో విడిభాగాల అతి పెద్ద సంస్థ అయిన ఎంఎస్ఎస్ఎల్ తన దేశీయ వైరింగ్ వ్యాపారాన్ని నిర్వీర్యం చేసే సమూహ పునర్నిర్మాణాన్ని ప్రకటించింది. ఎంఎస్ఎస్ఎల్‌ స్టాక్స్‌ 5.69% తగ్గి రూ. 97.75 వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
హెచ్‌డిఎఫ్‌సి లైఫ్
హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ జూలై నెల చివరి రోజున తన స్టాక్ నిఫ్టీ-50లో భాగమని ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ స్టాక్స్ 5.07% పెరిగి రూ. 575,75ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
ముత్తూట్ ఫైనాన్స్
నాన్-బ్యాంకింగ్ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు 3.15% పెరిగి రూ. 1143.90 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. కంపెనీ డైరెక్టర్ల బోర్డు వాటాల విభజన ప్రతిపాదనను పరిగణించింది.
 
ఆర్ఐఎల్
ఇంటెల్ రిలయన్స్ యొక్క జియో ప్లాట్‌ఫామ్‌లో 0.39% వాటాను సొంతం చేసుకుంటుందని కంపెనీ ప్రకటించిన తరువాత, నేటి ట్రేడింగ్ సెషన్ లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క స్టాక్స్ 1.57% పెరిగి, రూ.1788.00 వద్ద ట్రేడ్ అయ్యాయి. 
 
జెఎస్‌డబ్ల్యు స్టీల్
జెఎస్‌డబ్ల్యు స్టీల్ యొక్క మునుపటి సంవత్సరం ముడి ఉక్కు ఉత్పత్తితో ప్రస్తుత సంవత్సరం ముడి ఉక్కు ఉత్పత్తి 2021 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 30.2% తగ్గి 2.96 మెట్రిక్ టన్నులు పడిపోయింది. జెఎస్‌డబ్ల్యు స్టీల్ షేర్లు 1.77% తగ్గి రూ. 191.00ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
పిటిసి ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ఎస్‌బిఐ రూ. 300 కోట్ల ఋణ-డబ్ల్యుసి వృద్ధిని మంజూరు చేసిన తరువాత.పిటిసి ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 1.52% పెరిగాయి మరియు నేటి ట్రేడింగ్ సెషన్‌లో 3% ఇంట్రాడే పెరిగి, రూ.13.40 వద్ద ట్రేడ్ అయింది. 
 
యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు 1.37% పెరిగి రూ. 429.00 ల వద్ద ట్రేడయ్యాయి. బ్యాంకు యొక్క అనుబంధ సంస్థ అయిన యుకె విభాగపు యాక్సిస్ బ్యాంక్ యుకె లిమిటెడ్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది.
 
వేదాంత లిమిటెడ్
ఎన్ఎస్ఇ యొక్క నిఫ్టీ 50 బెంచిమార్కు నుండి స్వచ్ఛందంగా డీలిస్టింగ్ చేయాలని కంపెనీ ప్రతిపాదించిన తరువాత వేదాంత లిమిటెడ్ షేర్లు 0.28% తగ్గి రూ. 106.10 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వేదాంత లిమిటెడ్‌ను నిఫ్టీ 50 సూచీలో భర్తీ చేయనుంది.
 
భారతీయ రూపాయి
భారతీయ ఈక్విటీ మార్కెట్లో కొనుగోలు మధ్య నేటి ట్రేడింగ్ సెషన్లో యుఎస్ డాలర్‌తో పోలిస్తే 32 పైసలు అధికంగా, అంటే రూ. 74.64 వద్ద ముగిసింది.
 
బంగారం
పెరుగుతున్న కొరోనావైరస్ కేసులు మరియు చైనా మరియు యు.ఎస్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతల మధ్య నేటి ట్రేడింగ్ సెషన్లో బంగారం ఫ్లాట్‌గా వర్తకం చేసింది.
 
మిశ్రమ గ్లోబల్ మార్కెట్ సూచనలు
యూరోపియన్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడవుతుండగా, ఆసియా షేర్లు బలమైన యుఎస్ పేరోల్స్ డేటాపై ర్యాలీ చేశాయి. అయినప్పటికీ, యు.ఎస్ లో పెరుగుతున్న కొరోనావైరస్ కేసులు లాభాలను అధిగమించాయి. నాస్‌డాక్ 0.52%, నిక్కీ 225 0.66%, హాంగ్ సెంగ్ 0.99% పెరిగాయి. మరోవైపు, ఎఫ్.టి.ఎస్.ఇ ఎంఐబి మరియు ఎఫ్.టి.ఎస్.ఇ 100 వరుసగా 0.84% మరియు 0.92% తగ్గాయి.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీచ్ నుంచి షార్క్‌ను తన్నుకెళ్లిన పెద్దపక్షి, చూస్తే స్టన్నవుతారు-video