Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాభాల్లో స్టాక్ మార్కెట్లు... 35వేల మార్కును తాకిన సూచీ

Advertiesment
Market live
, శుక్రవారం, 3 జులై 2020 (09:56 IST)
market
బాంబే స్టాక్ మార్కెట్ వారాంతమైన శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. మూడో రోజూ వరుసగా ఈక్విటీ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. స్టాక్ మార్కెట్ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రధాన సూచీ 108 పాయింట్ల లాభంతో 35942 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 10584 వద్ద కొనసాగుతోంది.
 
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సాంకేతాలు, క్రూడాయిల్‌ పతనం, డాలర్‌ మారకంలో రూపాయి 3నెలల గరిష్టానికి చేరుకోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల పరంపర కొనసాగుతుండటం తదితర కారణాలు మార్కెట్ లాభాల ప్రారంభానికి కారణమయ్యాయి. 
 
బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లు లాభపడుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.68శాతం లాభంతో 22,101.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇకపోతే.. బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, టాటామోటర్స్‌ షేర్లు లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, మహీంద్రాఅండ్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌, మారుతి సుజుకీ షేర్లు నష్టాలను చవిచూశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ 19: ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి సూచనలు, సలహాలు