Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి భక్తులకు శుభవార్త, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా పెంపు

Advertiesment
శ్రీవారి భక్తులకు శుభవార్త, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా పెంపు
, బుధవారం, 2 సెప్టెంబరు 2020 (16:36 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. పరిమిత సంఖ్యలో టిటిడి ప్రత్యేక ప్రవేశ దర్సనా దర్సనం టిక్కెట్లను ఇస్తూ వస్తోంది. అయితే ఈ కోటాను పెంచుతూ టిటిడి నిర్ణయం తీసుకుంది.
 
ఇప్పటి వరకు టిటిడి 9 వేల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా ఇస్తుంటే మరో 3 వేల టిక్కెట్లను ఉచితంగా భక్తులకు అందిస్తోంది. భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటం.. దానికి తోడు 3 వేల ఫ్రీ టిక్కెట్లు త్వరగా అయిపోతుండటంతో టిటిడి కోటాను పెంచాలని నిర్ణయం తీసుకుంది.
 
నేటి నుంచి 300 రూపాయల టిక్కెట్లను పెంచుతున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. గంటకు 100 చొప్పున రోజుకు వెయ్యి టిక్కెట్లను ఆన్లైన్ అదనంగా కేటాయిస్తున్నట్లు టిటిడి ఆ ప్రకటనలో పేర్కొంది. ఆన్లైన్ ద్వారా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

02-09-2020 బుధవారం దినఫలాలు - నృశింహస్వామిని ఆరాధిస్తే..