Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకుంఠ ఏకాదశి: ఉప్పు, చింతపండు చేర్చకూడదట..!

Advertiesment
వైకుంఠ ఏకాదశి: ఉప్పు, చింతపండు చేర్చకూడదట..!
, గురువారం, 24 డిశెంబరు 2020 (10:44 IST)
Tamarind, Salt
వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉత్తర ద్వార దర్శనం చేసే వారికి సకల సంపదలు చేకూరుతాయి. వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆలయాల్లి సందర్శించడం ఉత్తమ ఫలితాలు దక్కుతాయి. ఏకాదశి రోజు రాత్రి జాగరణను మరిచిపోకూడదు. నారాయణ మంత్రంతో స్వామిని జపించాలి. ద్వాదశి రోజున వ్రతాన్ని ముగించే రోజున ఉదయం స్నానమాచరించి.. పెరుమాళ్ల వారికి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత ఆహారం తీసుకోవచ్చు. ద్వాదశి స్వామి వారికి సమర్పించే నైవేద్యంలో ఉప్పు, చింతపండు చేర్చ కూడదు. బియ్యంతో వండిన ఆహారం, గోధుమలు తీసుకోకూడదు.
 
వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు. 
 
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. 
 
ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు?- video