Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలభైరవ అష్టమి.. అప్పాల మాల.. నువ్వుల రొట్టెలు సమర్పిస్తే?

Advertiesment
కాలభైరవ అష్టమి.. అప్పాల మాల.. నువ్వుల రొట్టెలు సమర్పిస్తే?
, శనివారం, 5 డిశెంబరు 2020 (18:55 IST)
కాలభైరవ అష్టమి డిసెంబర్ ఏడో తేదీన వస్తోంది. ఈ రోజున కాలభైరవ అష్టకంతో ఆయన్ని స్తుతించడంతో పాటు ఆయనకు వాహనమైన శునకానికి మెడలో అప్పాల దండ వేయడం లేదా నువ్వుల నూనెతో కాల్చిన రొట్టెలు నైవేద్యంగా సమర్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా కాలభైరవ అష్టమి రోజున "ఓం భైరవాయ నమః" అనే మంత్రంతో స్మరిస్తే.. సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
కార్తీకంలో వచ్చే ఈ మహా కాలభైరవ అష్టమి రోజున ఉపవసించి పూజలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శనీశ్వరుడిచే ఏర్పడే ఈతిబాధలు తొలగిపోతాయి. కాలభైరవ అష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. పుణ్యతీర్థాల్లోనూ స్నానమాచరించాలి. ఆపై నలుపాటి శునకాలకు ఆహారం అందించాలి. ఎందుకంటే కాలభైరవుడి వాహనం నలుపు రంగు కలిగిన శునకమేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఉపవాసం వుండే వారు కాలభైరవుడితో కూడిన శివాలయ దర్శనం చేసుకోవాలి. పాలతో భైరవుడికి అభిషేకం చేయించాలి. ఉపవసించే వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. త్రిమూర్తుల్లో తానే గొప్పనని.. మహేశ్వరుడిని దూషణ చేసిన బ్రహ్మ దేవునికి బుద్ధి చెప్పడం కోసం సాక్షాత్ అమ్మవారి శరీరంలోకి ప్రవేశించి ఆజ్ఞాపించడంతో శివుని జటాజుటం వుంచి ఆవిర్భవించి బ్రహ్మకు చెందిన ఐదవ శిరస్సును ఖండన చేశాడు. ఇదే కాలభైరవుని ఆవిర్భావ తిథిగా కొలుస్తారు. 
 
కాలాష్టమి రోజున ఉపవాసం వున్నవారికి ఆర్థిక ఇబ్బందులు, సమస్త దోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు వుండవు. పితృదోషాలు తొలగిపోతాయి. చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. ఈ రోజున కాలసర్పదోష నివారణ చేయించుకోవడం, శక్తి పూజ, రక్ష పూజ చేయించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున నలుపు దుస్తులను భైరవునికి సమర్పించడం చేయాలి. నలుపు నువ్వులతో చేసిన వంటలను నైవేద్యంగా సమర్పించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-12-2020 శనివారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని పూజిస్తే...