Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ... చూడండీ ఈ పక్షితో సమానం...

సంసారంలో సుఖభోగాలను అనుభవించాలని కోర్కెలున్నంత కాలం కర్మ త్యాగం చేయలేము. సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంత వరకు కర్మ ఉండనే ఉంటుంది. కర్మలను పోగొట్టుకున్న తర్వాత వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఈ పక్షి కథ ద్వారా తెలుసుకుందాం.

Advertiesment
Truth in Life
, శనివారం, 28 ఏప్రియల్ 2018 (17:06 IST)
సంసారంలో సుఖభోగాలను  అనుభవించాలని  కోర్కెలున్నంత కాలం కర్మ త్యాగం చేయలేము. సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంత వరకు కర్మ ఉండనే ఉంటుంది. కర్మలను పోగొట్టుకున్న తర్వాత వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఈ పక్షి కథ ద్వారా తెలుసుకుందాం. 
 
ఒక పక్షి గంగానదిలో లంగరు దించివున్న ఓడ స్తంభంపై పరధ్యానంగా వ్రాలింది. ఓడ గంగానది నుండి క్రమక్రమంగా సముద్రం లోపలికి ప్రవేశించింది. అప్పుడు పక్షికి ఎరుక వచ్చి చూసేసరికి నలువైపులా ఎక్కడా తీరం కనిపించలేదు. తీరం చేరుకోవాలని అది ఉత్తరం వైపుగా ఎగిరిపోయింది. కాని అలా ఎంతదూరం పోయినా దానికి తీరం కనిపించలేదు. అందువల్ల అది తిరిగి వచ్చి ఓడ స్తంభం పైనే కూర్చుంది. కాసేపటి తర్వాత అది తూర్పు దిశగా ఎగిరిపోయింది. ఆ దిశలో కూడా దానికి తీరం కానరాలేదు. 
 
ఆ పక్షి నలువైపులా చూసింది. కేవలం అనంత జలరాశి మాత్రమే కనిపించింది. అప్పుడది ఎంతగానో అలసిపోయి తిరిగి వచ్చి ఓడ స్తంభం పైనే వ్రాలింది. ఈ విధంగా చాలాసేపు విశ్రాంతి తీసుకున్న పిదప అది మళ్లీ దక్షిణ దిశగా వెళ్లింది. అదేవిధంగా పడమటి వైపుగా కూడా వెళ్లింది. తీరం ఎక్కడా కానరావటం లేదని గ్రహించిన తర్వాత అది తిరిగి వచ్చి ఆ ఓడ స్తంభం పైనే వ్రాలింది. మళ్లీ తిరిగి లేవలేదు. ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ తరువాత దాని మనస్సులో ఎటువంటి అలజడి, అశాంతి చోటుచేసుకోలేదు.
 
సంసారులు సుఖభోగాల నిమిత్తం నలువైపులా తిరుగుతుంటారు. అయితే వారికి అవి ఎక్కడా లభించవు. అలా తిరుగుతూ చివరకు వారు అలసిపోతారు. కామినీకాంచనాల పట్ల వారికి ఉన్న ఆసక్తి ద్వారా కేవలం దుఃఖాన్ని మాత్రమే పొందినప్పుడు వారికి వైరాగ్యం కలుగుతుంది. త్యాగభావన జనిస్తుంది. చాలా మందికి సుఖభోగాలు అనుభవింపనిదే త్యాగబుద్ధి కలుగదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-04-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.... సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని..