Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే వాటిపై అలాంటి ఫలితాలు...

విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే వాటిపై అలాంటి ఫలితాలు...
, బుధవారం, 16 జనవరి 2019 (21:15 IST)
మానవులు తమకున్న కష్టాల నుండి కాపాడమని భగవంతునుని అనేక రకాలుగా ప్రార్ధిస్తుంటారు. ఆ ప్రార్ధనలో భాగంగా వారు రకరకాల పూజలు, వ్రతాలు, పారాయణలు చేస్తుంటారు. వాటన్నింటిలోకెల్లా విష్ణుసహస్రనామ పారాయణ ఎంతో విశిష్టమైనది. విష్ణుసహస్రనామ పారాయణ విలువ తెలిస్తే అది చేసే మేలు అంతా ఇంతా కాదు అని శిరిడీ సాయిబాబాఅంతటివారు కూడా ఒక సందర్భంలో విష్ణుసహస్రనామ పుస్తకాన్ని తన హృదయానికత్తుకొని .. ఈ స్తోత్రం ఎన్నో సార్లు నన్ను ఎన్నో సమస్యలనుండి కాపాడింది. మీరంతా నిత్యం పఠించమని శ్యామాతో పలికారు.
 
ఈ దైనందిన జీవితంలో సామాన్య మానవుల సకల సమస్యలకు పరిష్కారమేంటీ అని అడిగిన ధర్మరాజుకు భీష్మపితామహులు మానవజాతికి ఉపదేశించిన స్తోత్రమే శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రము. శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రంలో మెుత్తం 108 శ్లోకాలు ఉంటాయి. సహస్రం అంటే వెయ్యి అని అర్ధం. వెయ్యి నామాలన్నీ కూడా శ్రీమన్నారాయణుని స్తుతించే నామాలే. అత్యంత శక్తి వంతమైన శ్లోకాలు అవి. ఒక్కో శ్లోకంలోఒక్కో సందర్బానికి తగినట్లుగా ఒక్కో సమస్యను పరిష్కరించే శక్తి దాగి ఉంది.ధనాభివృద్ధికి, మంచి ఆరోగ్యానికి, విద్యాభివృద్ధికి, మనశ్శాంతికి ఈ విష్ణుసహస్రనామ పారాయణ ఎంతో మేలు చేస్తుంది. నిత్య జీవితంలో మానవులు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఎవకి కోరికను అనుసరించి వారు ఈ పారాయణను చేయవచ్చు. 
 
ధనాభివృద్ధికి..
విస్తారః స్ధావరః స్ధాణుః ప్రమాణం బీజమవ్యయం
అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః 
 
విద్యాభివృద్ధికి..
సర్వగహః సర్వ విద్భానుర్ విష్వక్ సేనో జనార్ధనః
వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిద్ కవిహిః  
 
మేధాసంపత్తికి...
మహాబుద్ధిర్ మహావీర్యో మహాశక్తిర్ మహాద్యుతిః
అనిర్ దేశ్య వపుః శ్రీమానమే యాత్మా మహాద్రిధృక్
 
కంటి చూపునకు...
అగ్రణీర్ గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః
సహస్రమూర్ధావిశ్వాత్మాసహస్రాక్షః సహస్రపాత్
 
కోరికలీడేరుటకు..
అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృత్శుచిః
సిద్ధార్ధః సిద్ధ సంకల్పః సిద్ధిదహః సిద్ధి సాధనహః 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-01-2019 బుధవారం దినఫలాలు - ఆర్థిక విషయాల్లో పురోగతి...