Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీత ఏడ్వటంతోనే లంక నాశనం.. మరి స్త్రీలు కన్నీరు పెడితే..? జానకీ రామాయణము రచయిత రాంబాబు ముగింపు మాటలు..

Advertiesment
సీత ఏడ్వటంతోనే లంక నాశనం.. మరి స్త్రీలు కన్నీరు పెడితే..? జానకీ రామాయణము రచయిత రాంబాబు ముగింపు మాటలు..
, బుధవారం, 1 జూన్ 2016 (18:13 IST)
అమ్మ అంటే అనురాగానికి, మమకారానికి మారుపేరు. అమ్మ అనురాగానికి అవధులు వుండవు. అమ్మ ప్రేమకు ఏ విధులు లేవు. అమ్మ ప్రేమలో స్వార్థం వుండదు. ప్రకృతిలో మన నుండి ఏమీ ఆశించకుండా వర్షం ఎలా కురుస్తున్నదో, సూర్యుడు ఎలా కాంతిని ప్రసరిస్తున్నాడో, గాలి ఎలాగైతే ప్రాణ వాయువుని ఇస్తున్నదో, అలా అమ్మ మన పైన ప్రేమను కురుపిస్తున్నది. 
 
ఆకాశం ఎలా వుంటుంది అంటే ఆకాశంలాగానే ఉంటుంది. సముద్రం ఎలా వుంటుంది. అంటే సముద్రంలాగానే వుంటుంది. వీటిని ఇంకొక వస్తువుతో పోల్చలేం. అలాగే అమ్మ ఎలా వుంటుంది. అంటే అమ్మలాగానే వుంటుంది. సూర్యుడు ఎలా మనకు ప్రత్యక్ష దైవమో అలాగే మనకు అమ్మ ప్రత్యక్ష దైవము. 
 
అమ్మ అన్నమాట వినగానే ఈ సృష్టిలో ఏ వ్యక్తికైనా కలిగే తొలి భావన ప్రేమమూర్తి. మొదట చెప్పబడిన పతివ్రతలలో ఎవ్వరినీ మనం తల్లి అని పిలవం. అహల్యతల్లి అనిగాని, ద్రౌపతి తల్లి అనిగాని పిలవం. కానీ సీతను మాత్రమే సీతమ్మతల్లి అని లేదా సీతమ్మ అని పిలుస్తాం. ఎవరైనా రామాయణ ప్రవచనాలు చేస్తున్న, రాముడు అని, లక్ష్మణుడని, రావణుడని అంటారు కాని సీతను మాత్రం సీతమ్మతల్లి అనే ప్రబోధిస్తారు. ఎందుకంటే ఆమెలోని, ప్రేమ, కరుణ, మనచేత అలా పలికేలా చేస్తుంది. సీతమ్మ మాటవిన్నా, ఆమె చిత్రపటం చూసినా మనకు మనస్సులో అమ్మ స్ఫురిస్తుంది. 
 
సీత కూతురిగా తండ్రిని గౌరవించింది. భార్యగా భర్తను ఆరాధించింది. కోడలుగా అత్తమామలను గౌరవించింది. తల్లిగా పిల్లలను ప్రేమించింది. సుఖాలను అనుభవించింది. అంతే కష్టాలను భరించినది. ఏ స్త్రీ అనుభవించని కష్టాలను అనుభవించింది. సీతమ్మ పడ్డ కష్టాలు తలుచుకుంటే మనస్సున్న ఏ వ్యక్తికైనా కంటినుండి నీరు కారకమానదు. అన్ని కష్టాలలో కూడా ఓర్పు సహనంతో ధర్మాన్ని తప్పకుండగా, ఎంత అనుమానించినను భర్తను నిందించకుండా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుని ఏ భూమాత గర్భం నుండి ఆవిర్భవించిందో ఆ భూమాత ఒడిలోనికి చేరిన పనిత్రమైన నారీమణి సీతమ్మ. 
 
ఏ ఇంట్లో స్త్రీ దుఃఖము చెందక సుఖముగా వుంటుందో ఆ ఇంటిలోని కుటుంబసభ్యులందరూ లక్ష్మీకటాక్షము చేత, భోగభాగ్యములు అనుభవిస్తూ సుఖముగా నుండెదరు. ఏ ఇంటిలో స్త్రీ కన్నీరు పెడుతుందో అయింటి అరిష్టము వాటిల్లుతుంది. సీత లంకలో రాముని కొరకై ఎంత దుఃఖము చెందినదో ఫలితముగా లంక నాశనమైనది. చివరికి రావణాసురుడు వధించబడ్డాడు. 
 
ప్రతి స్త్రీకి ముఖ్యంగా కావలసిన ఓర్పు, సహనం, ప్రస్తుత సమాజములో స్త్రీలలో గాని, పురుషులలో గాని ఆ రెండు లోపించడం వలన వారి దాంపత్య జీవితములో అనేక అనర్థాలు అపార్థాలు చోటుచేసుకుంటూ ప్రేమానురాగాలకు దూరంగా జీవితాలను తీసుకెళ్తున్నాయి. రాముడు సీతను అనుమానించినప్పుడు ఆ అనుమానాన్ని తొలగించి, తన భర్తే తనకు దైవము అని నమ్మించిన పతివ్రత సీత. నిజానికి భార్య తప్పక లభిస్తుంది. ధర్మం ఎక్కడ వుంటే అక్కడ రక్షణ వుంటుంది. - రాంబాబు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... శ్రీవారి సేవలో సచిన్ - చిరంజీవి - నాగార్జున