Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం...

స్వామి అయ్యప్ప మకర సంక్రాంతి నాడు మకరజ్యోతి దర్శనం ఇస్తాడు. అసలు అయ్యప్పు వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం. దేవతలపై పగ సాధించాలని మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ``శివుడికి కేశవుడికి పుట్టిన కొడుకు తప్ప నన్నెవరూ

Advertiesment
అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం...
, బుధవారం, 4 జనవరి 2017 (20:32 IST)
స్వామి అయ్యప్ప మకర సంక్రాంతి నాడు మకరజ్యోతి దర్శనం ఇస్తాడు. అసలు అయ్యప్పు వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం. దేవతలపై పగ సాధించాలని మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ``శివుడికి కేశవుడికి పుట్టిన కొడుకు తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి. అలా కానిపక్షంలో అతడు నా ముందు ఓడిపోవాలి'' అని వరం కోరింది మహిషి. ``తధాస్తు'' అనేసి తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ.

పాల సముద్రంలో ఉద్భవించిన అమృతాన్ని దేవ, దానవులకు పంచడానికై శ్రీహరి మోహినీ రూపాన్ని దాల్చాడు. పరమేశ్వరుడు ఆ సర్వాంగ సుందరియైన మోహిని పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మశాస్త. 
 
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వచ్చాడు రాజశేఖరుడు అనే పందళ దేశాధీశుడు, శివభక్తుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని నమ్మాడు. రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందించింది. వారెంతో వాత్సల్య అనురాగాలతో ఆ శిశువును పెంచసాగారు. ఆయన అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషమేమోగాని, ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవించింది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు ``అయ్యా'' అని మరికొందరు ``అప్పా'' అని, మరికొందరు రెండు పేర్లూ కలిపి ``అయ్యప్ప'' అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపించారు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తించాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేశాడు. అయ్యప్ప అడవికి బయలుదేరాడు. 
 
ఇంతలో నారదుడు మహిషి అనే రాక్షసిని కలిసి ``నీ చావు దగ్గరపడింది. రేపో, మాపో చస్తావని'' హెచ్చరించాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి సిద్ధపడి చెంగున ఒక్క దూకు దూకింది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు వచ్చిన దేవతలతో పాటు గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురష, సిద్ధ, సాధ్య, నారదాది ఋషి పుంగవులతో నింగి నిండిపోయింది. వీరి భీకరయుద్ధంలో భాగంగా ఆ మహిషిని ఒక్క విసురు విసిరాడు. నేల మీదపడి రక్తసిక్తమై కన్నీటితో చావు మూలుగులు మూలుగుతున్న ఆ మహిషి శరీరంపై తాండవమాడాడు. ఆ దెబ్బకి ఆ గేదె మరణించింది. దేవతలంతా ఆయన ముందుకు వచ్చారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ``దేవేంద్రా! నేను చిరుతపులిపాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి'' అన్నాడు. అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతదండుతో అయ్యప్ప తన రాజ్యం చేరాడు. 
 
అయ్యప్ప మంత్రిని పిలిచాడు ``ఇవిగో చిరుతపులులు, మీ వైద్యుణ్ణి పిలిచి పులి పాలు కావాలో చెప్పమను'' అన్నాడు. మంత్రి అయ్యప్ప పాదాలపై పడి శరణుకోరాడు. అయ్యప్ప అతడ్ని క్షమించాడు. అనంతరం ``తండ్రీ! నా జన్మకారణం నెరవేరింది. తమ్ముడైన రాజరాజన్నే పట్టాభిషిక్తుణ్ని చేయండి. నేను శబరిమలై చేరి సమాధిపొందుతాను నాకు ఆలయం కట్టించండి. నేను ఇక్కడ నుండి ఒక కత్తి విసురుతాను. అదెక్కడ పడితే అక్కడే చిన్ముద్ర. అభయహస్తాలతో సమాధిలో కూర్చుని అనంతరం పరమాత్మలో చేరతాను. నా చెంతనే మల్లిగపురత్తమ్మకు స్థానం య్యివండి. మిత్రుడైన వావరన్‌కు ఓ ఆలయం కట్టించండి.
 
సమాధికి వెళుతూ ఇలా అన్నాడు స్వామి, ``తండ్రీ! సంవత్సరానికి ఒక్కసారి మకర సంక్రాంతినాడు ఇతర భక్తులతోబాటు మీరు అక్కడికి వచ్చి నా దర్శనం పొందవచ్చు. నేను ధరించే ఆభరణాలన్నీ యిప్పుడు మీకు యిస్తాను. నా ఆలయానికి వచ్చినప్పుడు వీటిని కూడా తెచ్చి నా విగ్రహానికి అలంకరించి ఆనందించండి. నాకు ఎడమవైపుగా లీలా కుమారి కోసం నిర్మించే ఆలయంలోనే మా అన్నగారైన శ్రీ గణపతికి కుడురవన్‌, కుడుశబ్దన్‌ కురుప్పన్‌ మొదలైన భూతగణాలకి, నాగరాజుకి తావిచ్చి ప్రతిష్టలు జరిపించండి. బాబరన్‌కి ఎరుమేలిలో ఆలయం నిర్మించండి. నా దర్శనానికి వచ్చే వారంతా ముందుగా మీ దర్శనం చేసుకోవాలి. అటు తర్వాతనే నా దర్శనానికి రావాలి'' అని తన ఆభరణాలను తీసి యిచ్చేశాడు. ఆపై అయ్యప్ప సమాధినిష్ఠుడయ్యాడు. శబరిమలై ఆలయం వెలిసింది. స్వామియే శరణమయ్యప్ప.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఎందుకంటారంటే..!