Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఎందుకంటారంటే..!

ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎప్పుడన్నా అన్నం వదిలేస్తే పెద్దవాళ్ళు అన్నం అలా పారవేయకూడదు అన్నం పరబ్రహ్మస్వరూపం అని అంటారు. అలా ఎందుకు అంటారు అని ఎప్పుడన్నా పెద్దవాళ్ళను అడిగినా చిన్నపిల్లలు 100 శాతం నమ్మ

అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఎందుకంటారంటే..!
, బుధవారం, 4 జనవరి 2017 (15:33 IST)
ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎప్పుడన్నా అన్నం వదిలేస్తే పెద్దవాళ్ళు అన్నం అలా పారవేయకూడదు అన్నం పరబ్రహ్మస్వరూపం అని అంటారు. అలా ఎందుకు అంటారు అని ఎప్పుడన్నా పెద్దవాళ్ళను అడిగినా చిన్నపిల్లలు 100 శాతం నమ్మేలా కారణం చెప్పరు. 
 
నిజానికి ప్రతి జీవి పుట్టకముందే ఆ జీవికి కావాల్సిన ఆహార పదార్థాలు ఈ భూమి మీద పుట్టిస్తాడు ఆ భగవంతుడు. అందుకే ఏ జీవి ఈ నేల మీద పడ్డా నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దవాళ్ళు అంటారు. అంటే మనము ఈ భూమి మీద పడకమునుపే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్ళు అని ఆ భగవంతుడు మన పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాల లెక్కలు వేసే ఆహారాన్ని, నీల్ళను మనం ఎవరికి పుట్టాలో కూడా నిర్ణయించి ఈ భూమి మీదకు పంపుతాడు.
 
ఎప్పుడైతే ఒక జీవికి ఆయన ప్రసాదించిన నీళ్ళు, ఆహారం అయిపోతాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లి ఆ జీవికి ఆయువు పూర్తి అయిపోతుంది. అందుకే మీకు పెట్టిన ఆహారంకాని, నీళ్ళు కానీ వృథా చేయకుండా నీకు అక్కరలేదు అనిపించినప్పుడు ఎవరికన్నా దానం ఇవ్వడం వల్ల నీకు పుణ్యఫలం పెరిగి నీకు నచ్చిన ఆహారం కానీ నీళ్లు కాని మరి కొంచెం పెరిగి ఆయుష్మంతుడవు అవుతావు. లేదా నీకు అని ఆ దేవదేవుడు ఇచ్చిన ఆహారాన్ని నేలపాలు చేస్తే నీకు లెక్కగా ఇచ్చిన ఆహారం తరిగి నీ ఆయువు తరిగిపోతుంది.
 
ఏ తల్లి అయినా చూస్తూ చూస్తూ బిడ్డ ఆయువు తరిగిపోవడం చూడలేక అన్నం పారవేయక అని పదిసార్లు చెబుతుంది. అవసరమైతే దండస్తుంది. ఇదంతా మీకు వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం పారవేయద్దు అని మాత్రమే చెబుతారు. అందుకే అన్ని దానాలలోని అన్నదానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఏ జీవికైనా ఆహారం పెడితే కడుపునిండా తిని నిండు మనస్సుతో పెట్టిన వారిని ఆశీర్వదిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రికార్డు స్థాయిలో షిరిడీ సాయిబాబా హుండీ ఆదాయం...