Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

ఇలా చేస్తే మీకు దరిద్రంపోయి ధనవంతులవుతారట...!

ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి మనం ధనవంతులం కావాలంటే ఆమెకు ఆగ్రహం వచ్చే ఏ పనులు చేయకూడదు. లక్ష్మీదేవి కరుణకు పాత్రులవ్వాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుని అలా చేస్తే ఆమె ఆనందించి మీ ఇంట సిరులను కురిపి

Advertiesment
Laxmi Pooja
, శుక్రవారం, 30 జూన్ 2017 (13:21 IST)
ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి మనం ధనవంతులం కావాలంటే ఆమెకు ఆగ్రహం వచ్చే ఏ పనులు చేయకూడదు. లక్ష్మీదేవి కరుణకు పాత్రులవ్వాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుని అలా చేస్తే ఆమె ఆనందించి మీ ఇంట సిరులను కురిపిస్తుంది. ఆ సిరుల తల్లికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. ఆ రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుని మీ ఇంట ధనవర్షాన్ని కురిపిస్తుంది. అలా జరగాలంటే మీరు ఇలా చేయాల్సిందే.
 
శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందులోనూ లక్ష్మీదేవికి ప్రతిరూపం శుక్రవారం. శుక్రవారం అమ్మవారి విగ్రహానికి పువ్వులతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి పూజలు చేయడం వల్ల ఆ తల్లి ఆశీస్సులు పొందవచ్చు. అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించి కాళ్ళు, చేతులు, ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి కరుణాకటాక్షాలతో పాటు సిరులు వస్తాయి. 
 
ప్రతి శుక్రవారం అమ్మవారి ఫోటో లేదా విగ్రహానికి శుభ్రం చేసి గంధం లేదా కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి. అమ్మవారిని ఆహ్వానిస్తూ చేసే స్త్రోత్రం అంటే మహాలక్ష్మిస్త్రోత్రాన్ని చదవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మామిడి పండ్లను నైవేధ్యంగా పెట్టాలి. మామిడిపండును అమ్మవారికి పెడితే అష్ట ఐశ్వర్యాలు వస్తాయి. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ లోటుండదు. 
 
అంతేకాదు వ్యాపారస్తులకు ఎలాంటి నష్టం ఉండదు. బాగా పండిన మామిడి పండును అమ్మవారిని నైవేధ్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ తినాలి. అంతేకాదు అమ్మవారికి పెట్టిన నైవేధ్యం రెండు మామిడిపండ్లను ఎవరైనా ముత్తయిదువుకిస్తే మీ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది. అలాగే మామిడి జ్యూస్‌ను అమ్మవారికి పెట్టి వాటిని మనం ఉదయాన్నే తాగాలి. ఇలా చేస్తే ఆర్థిక బాధలు పూర్తిగా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ రాశి ఫలాలు (30-06-17) : విద్యార్థినులకు కొత్త పరిచయాలు...