Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ రాశి ఫలాలు (30-06-17) : విద్యార్థినులకు కొత్త పరిచయాలు...

మేషం... ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల కలయికతో సంతోషం కలిగిస్తుంది. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. మ

Advertiesment
మీ రాశి ఫలాలు (30-06-17) : విద్యార్థినులకు కొత్త పరిచయాలు...
, గురువారం, 29 జూన్ 2017 (22:24 IST)
మేషం...
ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల కలయికతో సంతోషం కలిగిస్తుంది. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. మీపై శకునాల ప్రభావం అధికమవుతుంది. 
 
వృషభం
గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు బంధువులతో సంత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. 
 
మిథునం
స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పాత మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రవాణా, ఎగుమతి, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం, మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలరు. 
 
కర్కాటకం
ఒక వ్యవహారం నిమిత్తం న్యాయ సలహా స్వీకరిస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. 
 
సింహం
విద్యార్థులకు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. బంధు మిత్రులకు ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనవసరపు విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. 
 
కన్య
ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థిక అవసరాలకు అందివస్తారు. రాజకీయ నాయకులకు కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్ళలో చికాకులు, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. స్త్రీలు అందరియందు కలుపుగోలుతనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. 
 
తుల
ఉద్యోగస్తులు సమర్థంగా పని చేసి అధికారుల మెప్పు పొందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికే చేయు కృషిలో పోటీ అధికమవ్వడంతో ఆందోళన తప్పదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు వాతావారణంలోని మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
వృశ్చికం
స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు, ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. కోర్టుకు హాజరవుతారు. రాజకీయ నేతలకు ఊహించిన అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. 
 
ధనస్సు 
ప్రముఖులతో చర్చలు జరుపుతారు. వ్యాపారాభివృద్ధికి కొత్తకొత్త పథకాలు రూపొందిస్తారు. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. శ్రీమతి, శ్రీవారు మధ్య అనుమానాలు అపోహలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ప్రకటనలు, మధ్యవర్తుల విషయంలో అవగాహన ముఖ్యం. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. 
 
మకరం
స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనం అందినా దానికి తగినట్టుగానే ఖర్చులు ఉంటాయి. అనవసరపు ఆలోచనలతో మనసు పాడుచేసుకోకుండా అందరితో సంతోషంగా మెలగండి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురువుతాయి. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
కుంభం
అధైర్యం వదిలి ధైర్యంతో ముందుకు సాగి జయం పొందండి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. సొంతంగా గృహం ఏర్పరచుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మీనం 
బంధువుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. కొబ్బరి, మామిడిపండ్ల, పూల, కూరగాయ రంగాల్లో వారికి లాభదాయకం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి సమయాల్లో పరమేశ్వరుడిని పూజిస్తే...(వీడియో)