Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలాంటి బొట్టు పెట్టుకుంటే ముఖం మీద నల్లటి మచ్చలు

Advertiesment
Sandalwood Blob
, సోమవారం, 4 నవంబరు 2019 (22:37 IST)
భగవంతునికి పూజ చేస్తుంటాం. ఆ తర్వాత బొట్టు కూడా పెట్టుకుంటాం. కొందరు గంధపు బొట్టు పెడుతుంటారు. కానీ ఈ బొట్టును గంధపుచెక్కతో గంధపుసానపైన తీసిన గంధంతోనే పెట్టుకోవాలి. అదే శ్రేష్టమైనది. డబ్బాల్లో పెట్టి అమ్మే గంధపుపొడి ఆరోగ్యాన్ని చెడగొట్టుతుంది. దానిలోను కెమికల్స్ కలుపుతూండడం వల్ల ముఖము మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చర్మ రోగాలు ప్రబలి బాధ గలిగిస్తుంటాయి. 
 
అందువల్ల అంత మంచిదికాదు. సానపైన దీనిని గంధాన్ని మొదట దేవునికి పెట్టి ప్రసాదబుద్ధితో పెట్టుకొనవలెను. దేవతలకు గంధాన్ని సమర్పిస్తే సంతోషించి అనుగ్రహిస్తారని మీమాంసాశాబరభాష్యంలో కనుపిస్తుంది. మహాపాపపరిహారానికి సాలగ్రామశిలపై ఉంచిన గంధాన్ని పూసుకోవాలని పురాణాలు చెపుతున్నాయి.
 
శ్లో|| సాలగ్రామశిలాలగ్న చందనం ధారయేత్సదా|
సర్వాంచేషు మహాపాపశుద్ధయే కమలాసన||
 
కాన గంధమును భగవంతునికి సమర్పించిన తర్వాత పూసుకొనవలెను. ఇక గంధములో ఉండే గుణాలను తెలుసుకుందాం. నొసట గంధం పూయడంవల్ల మెదడు చల్లబడుతుంది. కోపావేశమణగుతుంది. శాంతి చేకూరుతుంది. తలపైన గంధం పూయడం వల్ల మనస్సు ఏకాగ్రమవుతుంది. లలాటప్రదేశంలో పూయడంవల్ల కనుబొమల ముడిమధ్య కేంద్రీకరించిన జ్ఞాన తంతువులకు స్ఫూర్తిగలుగుతుంది. సంకల్ప శక్తి దృఢపడుతుంది. అవయవాలన్నీ చురుకుగా పనిచేస్తాయి. 
 
చందనము రక్తదోషాల నరికట్టుటలో పైత్యాన్ని తగ్గిస్తుంది. చలువ చేస్తుంది. వీర్యాన్నీ స్థిరపరుస్తుంది. విషక్రిముల నశింపచేస్తుంది. గాయాల మాన్పుతుంది. బలాన్ని తేజస్సును గలిగిస్తుంది. చర్మరోగాలకు చందనం దివ్యౌషధము. ఇటువంటి గుణాలెన్నో ఉన్నాయి. గంధం పూసుకొనడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం సుగమమవుతుందని సిద్ధులు చెపుతూంటారు. గంధధారణ వల్ల గలిగే ఆధ్యాత్మికలాభాన్ని కఠోపనిషత్తు వివరించింది. చందనలేపమన్నివిధాల ఆరోగ్యాన్ని కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల నుంచి పచ్చకర్పూరం ప్రసాదంగా వచ్చిందా? ఏం చేయాలి?