సీతమ్మ భూదేవి ఒడిలోకి చేరిపోతే.. రామలక్ష్మణులు ఎలా తనువు చాలించారో తెలుసా?
వాల్మీకి రామాయణాన్ని అద్భుతంగా రచించారు. ఆ గ్రంథానికి పవిత్రతను చేకూర్చారు. రామ జననం, రాక్షసుల సంహారం, సీత పరిణయం, వనవాసం, రావణాసురుడు సీతను అపహరించుట, రాముని వధ.. ఇలా రామాయణంలో అద్భుత ఘటనలను కాండలుగా
వాల్మీకి రామాయణాన్ని అద్భుతంగా రచించారు. ఆ గ్రంథానికి పవిత్రతను చేకూర్చారు. రామ జననం, రాక్షసుల సంహారం, సీత పరిణయం, వనవాసం, రావణాసురుడు సీతను అపహరించుట, రాముని వధ.. ఇలా రామాయణంలో అద్భుత ఘటనలను కాండలుగా విభజించి రామాయణాన్ని రామ భక్తులకు ప్రసాదించాడు వాల్మీకి మహర్షి. రాముడు, సీత, లక్ష్మణులు ఎలా ఈ లోకాన్ని విడిచి వెళ్లారో చాలామందికి తెలియదు. సీతమ్మ భూదేవి ఒడిలోకి వెళ్ళిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రామలక్ష్మణులు ఈ లోకాన్ని విడిచి ఎలా వెళ్లారంటే.. రావణాసురుని చెర నుంచి సీతమ్మను విడిచిపెట్టిన సీతకు రాముడు అగ్నిపరీక్ష పెడతాడు. ఈ పరీక్షలో సీతమ్మే నెగ్గుతుంది.
కానీ అగ్నిప్రవేశానికి అనంతరం సీతను తీసుకొచ్చి రాజ్యమేలుతున్నప్పుడు ఓ చాకలివాని మాటలకు చింతించి.. సీతను వాల్మీకి ఆశ్రమంలో రాముడు వదిలిపెట్టేస్తాడు. కొన్ని సంవత్సరాలకు తర్వాత సీతను అయోధ్యకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కానీ సీతాదేవి తల్లి భూదేవిని ప్రార్థిస్తూ తనను ఈ లోకం నుంచి తీసుకువెళ్లమని వేడుకుంటుంది. దీంతో భూదేవి ఒక్కసారిగా భూమి చీల్చుకుని పైకి వచ్చి సీతను తనతో తీసుకెళ్తుంది. అలా సీత తన తనువు చాలిస్తుంది. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, వారణాసి ప్రాంతాలను కలుపుతూ ఉండే జుంగిగంజ్ అనే రైల్వే స్టేషన్ వద్ద సీతామర్హి అనే ఓ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో సీతాదేవి తన తల్లి భూదేవి ఒడికి చేరిపోయిందని చెప్తుంటారు.
ఇక రామలక్ష్మణులు ఎలా తనువు చాలించారంటే.. సీత వెళ్లిపోయాక రాముడు రాజ్యాన్ని పాలిస్తూ లవ, కుశులకు రాజ్యాన్ని పాలించే అర్హత వచ్చాక.. వారికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. వారికి పట్టాభిషేకం చేయిస్తాడు. అనంతరం ఓ రోజు రాముడి వద్దకు యమధర్మ రాజు ఒక ఋషి వేషంలో వస్తాడు. అలా వచ్చీ రాగానే రామున్ని తీసుకుని ఆ ఋషి కోటలో ఉన్న ఓ గదిలోకి వెళ్తాడు. ఆ గదికి కాపలాగా లక్ష్మణున్ని నియమిస్తారు. లోపలికి ఎవరినీ అనుమతించవద్దని లక్ష్మణునికి రాముడు చెప్తారు. అనంతరం ఆ ఋషి రాముడితో తనువు చాలించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతాడు.
ఇందుకు అంగీకరించిన రాముడు ఓ శుభముహూర్తంలో సరయూ నదిలోకి వెళ్ళి అంతర్థానమవుతాడని పద్మపురాణంలో వివరించారు. అనంతరం లక్ష్మణుడు కూడా అదే నదిలో తన తనువు చాలిస్తాడు. తన నిజరూపమైన శేషనాగు అవతారంలోకి అతను మారిపోతాడు. రాముడు విష్ణు అవతారంలోకి నిక్షిప్తం అవుతాడని పురణాలు చెప్తున్నాయి.