Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణా పుష్క‌రాల కోసం మ‌రో 4 రోజులు క‌ష్ట‌ప‌డండి... చంద్రబాబు సూచన

విజయవాడ : ‘‘కృష్ణా పుష్కరాలు ప్రాంభమై విజయవంతంగా వారం రోజులు పూర్తవుతోంది, మిగిలిన నాలుగు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి, ఉదాశీనత ఉండకూడదు, ఉత్సాహంగా పనిచేయాలి, యాత్రీకుల సంఖ్య పెరిగినకొద్దీ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరగాలి’’ అని ముఖ్యమంత్రి నారా చం

Advertiesment
కృష్ణా పుష్క‌రాల కోసం మ‌రో 4 రోజులు క‌ష్ట‌ప‌డండి... చంద్రబాబు సూచన
, గురువారం, 18 ఆగస్టు 2016 (20:23 IST)
విజయవాడ : ‘‘కృష్ణా పుష్కరాలు ప్రాంభమై విజయవంతంగా వారం రోజులు పూర్తవుతోంది, మిగిలిన నాలుగు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి, ఉదాశీనత ఉండకూడదు, ఉత్సాహంగా పనిచేయాలి, యాత్రీకుల సంఖ్య పెరిగినకొద్దీ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరగాలి’’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాలు 7వ రోజు ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం ఉండవల్లి లోని తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాయకత్వం, అంకితభావం, సమన్వయం, సమాచార మార్పిడిలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ముందుండాలన్నారు. అధునాతన పరికరాలు అందుబాటులో ఉంచామని, యాత్రీకుల సేవల్లో సర్వశక్తులు వినియోగించాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
 
చిన్నారులకు పాలు పంపిణీ చేస్తున్నవారికి అభినందనలు :
కొన్ని పుష్కర ఘాట్ల వద్ద యాత్రీకులతో పాటు వచ్చిన చిన్నపిల్లలకు పాలు పంపిణీ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు, అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని పొందుగల, సత్రశాల, దైదలో నదిలో నీటిమట్టం అధికంగా ఉన్నందున ఘాట్ల పైనే పూల్స్ ఏర్పాటు చేసి వాటిలోకి నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసి యాత్రీకుల పుష్కర స్నానానికి ఏర్పాట్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ అమలు చేసినా పరిశీలించి వాటిని అన్నిచోట్ల అమలు చేయాలన్నారు. 
 
విజయవాడ రైల్వే పుష్కర నగర్ వద్ద యాత్రీకులు నిద్రించే చోట్ల కార్పెట్ వేయాలని సూచించారు. యాత్రీకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. స్వచ్చంద సంస్థలు, నగర పౌరులు వారంతటవారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పుష్కర యాత్రీకులకు ఆహారం, తాగునీరు పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకం అంటూ, ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
 
సమష్టి కృషి వల్లే అందరి నుంచి ప్రశంసలు:
పుష్కర ఏర్పాట్లపై విదేశీ యాత్రీకుల నుంచి కూడా ప్రశంసలు రావడం హర్షణీయం అంటూ, సమష్టి కృషి వల్లే అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయన్నారు. చైల్డ్ ట్రాక్ సిస్టమ్ ద్వారా మిస్సింగ్ చైల్డ్ ట్రేసింగ్‌కు యాత్రీకుల నుంచి మంచి స్పందన వస్తోందని, తప్పిపోయిన పిల్లల సమాచారం త్వరితగతిన తల్లిదండ్రులకు అందజేస్తుండటంతో వారిలో ఆనందం అంతాఇంతా కాదని చెప్పారు. కీలకమైన రోజులు శుక్ర, శని, ఆదివారాల్లో యాత్రీకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, మాట రాకుండా పనిచేయాలని కోరారు. 
 
విజయవాడ పద్మావతి ఘాట్లో ‘డి’, ‘ఈ’ గేట్ల వద్ద అత్యధిక రేటింగ్ వచ్చిందని, దానిని నిలబెట్టుకోవాలని అన్నారు. బస్టాండ్ ఘాట్‌కు గురువారం 1.5 లక్షల మంది యాత్రీకులు వచ్చినా అన్ని సదుపాయాలు కల్పించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సదుపాయాల కల్పన, యాత్రీకుల సేవల్లో విజయవాడ పద్మావతి ‘ఈ’ ఘాట్‌కు మంచి రేటింగ్ వచ్చింది, కృష్ణవేణి, సీతానగరం ’బి‘, పున్నమి ’బి‘లకు మంచి రేటింగ్ వచ్చింది. మిగిలిన ఘాట్ల వద్ద కూడా ఇదే రేటింగ్ వచ్చేలా సదుపాయాలు కల్పించాలని, సేవలు పెంచాలని, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అనంతరం హెలికాప్టర్ పైన కృష్ణా, గుంటూరు జిల్లాలలోని పుష్కర ఘాట్లను పరిశీలించి సాగరసంగమం హంసల దీవి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ పైన దిగి అక్కడ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా పుష్కరాల్లో తితిదే, స్వచ్చంద సంస్థల ఉచిత అన్న ప్ర‌సాదం... ఈగలు తోలుకుంటున్న హోట‌ల్స్...