గురునానక్ జయంతిని దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్నారు. గురునానక్ దేవ్ 1469లో రాయ్ భోయ్ డి తల్వాండి గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం పాకిస్థాన్‌లో ఉంది. నేను దేవుడిని కాదు. నేను అతడి అవతారం కూడా కాదు. అతని సందేశాన్ని అందజేసే మత ప్రవక్తను మాత్రమే అని గురునానక్ చెప్పాడు. ఇక గురునానక్ తన చివరి దశలో కర్తార్ పూర్ లో జీవించారు.
తన ఆహారాన్ని మత భేదం, కుల భేదం, ధన భేదం లేకుండా పంచుకునేవారు. గురు నానక్ పొలాల్లో పనిచేసి జీవిక సాగించేవారు. గురునానక్ ఆధ్యాత్మిక గురువుగా మారిన తరువాత అనేక గొప్ప విషయాలను గురించి ప్రభోధించారు. గురునానక్ జయంతి సందర్భంగా వాటిలో కొన్ని కొటేట్స్ మీ కోసం..
* ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు.
* భగవంతుడే అతి ముఖ్యమైన వాడు. దేవుడు ఒక్కడే.
* ఆకలితో అలమటించే వారికి అన్నం యిచ్చేవారినీ, దుస్తులేని వారికి దానం చేసే వారిని దేవుడు ప్రేమిస్తాడు.
* అందరూ గొప్ప పుట్టుక కలవారే
* అత్యాశను జయించిన వారిని భగవంతుడు ప్రేమిస్తాడు.
* పవిత్రమైన హృదయంతో అతడిని ధ్యానించడం, అతడిని ప్రశంశించడం అన్నవే ముక్తి మార్గాలు.