Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దైవానుగ్రహం ఎప్పుడు మీ మీద ఉంటుందో తెలుసా..!

మీరు ప్రతిసారి ఉందా? లేదా? అని ప్రశ్నించుకోవలసిన విషయం కాదు. అదెలప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఉండేదాన్ని ఉన్నట్లు గుర్తించకపోవడం వల్ల సమస్య ఏముంది? జీవితం సాగుతూనే ఉంటుంది కదా! కానీ దివ్యానుగ్రహంలో ఉన్న

దైవానుగ్రహం ఎప్పుడు మీ మీద ఉంటుందో తెలుసా..!
, గురువారం, 19 జనవరి 2017 (13:57 IST)
మీరు ప్రతిసారి ఉందా? లేదా? అని ప్రశ్నించుకోవలసిన విషయం కాదు. అదెలప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఉండేదాన్ని ఉన్నట్లు గుర్తించకపోవడం వల్ల సమస్య ఏముంది? జీవితం సాగుతూనే ఉంటుంది కదా! కానీ దివ్యానుగ్రహంలో ఉన్నామన్న సంతోషాన్ని కోల్పోతాం. ఈ దివ్యానుగ్రహం ఒకప్పుడుండి, మరొకప్పుడు పోయేది కాదు. మీరు ప్రతిసారి ఉందా? లేదా? అని ప్రశ్నించుకోవలసిన విషయం కాదు. అదెల్లప్పుడూ ఉంటుంది. మీరు దాన్ని ఆనందించాలంటే మీరు దాని పట్ల స్పృహ కలిగి ఉండాలి. 
 
దివ్యానుగ్రహంలోని ఆనందం అని నేనప్పుడు దాని మీరిలా అర్థం చేసుకోవాలి. నేను దీన్ని ఎన్నో విధాలుగా చెప్పాను. కానీ మీలో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేశారు. మీరు నాతో కూర్చున్నప్పుడు అది క్షణకాలమే అయినప్పటికీ ఇక మీకు జీవితంలో గోప్యమనేది ఉండదు. మీరు నాతో కూర్చున్నప్పుడు ముఖ్యంగా నేను దీక్ష ఇచ్చినప్పుడు అనుగ్రహం మీ మీద ఉందా, లేదా అన్న ప్రశ్నే ఉండదు. అది నిరంతరం ఉంటుంది. మీరు ఈ కృపను మీ పథకాలు పూర్తి నెరవేర్చాలని కోరుకుంటున్నారు. ఇది మీరు గుడికో చర్చికో వెళ్ళి దేవుడా? నా కోసం ఇది చేయి అని అడిగే పాత అలవాటు. ఆ దేవుడు పని చేయకపోతే మీరు దేవుణ్ణి మారుస్తారు.
 
గురుకృప మీ ప్రణాళికలను నెరవేర్చడం కోసం కాదు. అది మీ జీవిత ప్రణాళికను సఫలం చేయడం కోసం ఉద్దేశించింది. అనుగ్రహం అన్నది మీ చిన్న చిన్న కోరికలను తీర్చడానికి కాదు. ఏది ఏమైనా మీ ప్రణాళికలు, కోరికలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మీ జీవితంలో విభిన్న దశల్లో అవును ఇదే అనుకుంటారు. మరుక్షణంలో మీ నిర్ణయం మార్చుకుంటారు. మీరేదో విహార యాత్రకు పోదలచుకుంటారు. సద్గురూ మీరు నాకు సహాయం చేయరా? అని అడుగుతారు. దివ్య కృప నాపైన ఉందా? లేదా? అని రోజూ ప్రశ్నించుకోకండి. గురుకృప మీ ప్రణాళికను నెరవేర్చడం కోసం కాదు. అది మీ జీవిత ప్రణాళికను సఫలం చేయడం కోసం ఉద్దేశించింది. మీ జీవన సాఫల్యం పొందడం కోసం ఉద్దేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల జేఈఓ బదిలీ ఆగిపోయింది... ఆయన బలానికి తలొగ్గిన చంద్రబాబు!