Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల జేఈఓ బదిలీ ఆగిపోయింది... ఆయన బలానికి తలొగ్గిన చంద్రబాబు!

అవును... మీరు వింటున్నది నిజమే. తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు బదిలీ ఆగిపోయింది. అది కూడా ఎవరైతే బదిలీ చేయాలనుకున్నారో.. వారే వెనక్కి తగ్గారు. వైకుంఠ ఏకాదశి తర్వాత శ్రీనివాసరాజు బదిలీ ఖాయమని అందరూ అనుకున్న

Advertiesment
ttd jeo srinivasa raju
, గురువారం, 19 జనవరి 2017 (13:53 IST)
అవును... మీరు వింటున్నది నిజమే. తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు బదిలీ ఆగిపోయింది. అది కూడా ఎవరైతే బదిలీ చేయాలనుకున్నారో.. వారే వెనక్కి తగ్గారు. వైకుంఠ ఏకాదశి తర్వాత శ్రీనివాసరాజు బదిలీ ఖాయమని అందరూ అనుకున్నారు. దీంతో జెఈఓ తనకున్న పరిచయాలతో చక్రం తిప్పడం మొదలెట్టారు. అది కూడా పైస్థాయిలోని వ్యక్తుల పరిచయాలతో ఎక్కడ వికెట్ పడుతుందో అక్కడే బాల్ వేశాడు. దీంతో బదిలీ కాస్త ఆగిపోయింది.
 
ఆరు సంవత్సరాలు.. తితిదే చరిత్రలోనే ఇన్ని సంవత్సరాల పాటు జెఈఓగా ఉండటం ప్రస్తుత జెఈఓకే సాధ్యం. అది మరీ. ఏ జెఈఓ అన్నా రెండేళ్ళు ఉండటమే కష్టం. అలాంటిది ఈ జెఈఓ మాత్రం ఇన్ని సంవత్సరాలుగా ఉండటం తితిదే సిబ్బందినే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక అధికారి ఇన్ని రోజులు ఇక్కడ ఉండటంపై పలువురు తితిదే అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈసారి వైకుంఠ ఏకాదశి తర్వాత జెఈఓ బదిలీ ఖాయమని అందరూ భావించారు. అయితే ఒక్కసారిగా ఆయన బదిలీ నిలిచిపోయిందని తెలియడంతో తితిదే సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
బదిలీ చేస్తానని చెప్పింది ఎవరో కాదు.. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన చెప్పిన తర్వాత కూడా బదిలీ ఆగిపోవడం ఏమిటో తితిదే సిబ్బందికే అర్థం కావడం లేదు. తన బదిలీ జరిగిపోతోందన్న తెలుసుకున్న శ్రీనివాసరాజు బాబుకు అత్యంత సన్నిహితులైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాయకులతో సిఫారసు చేయించుకున్నారు. అది కూడా మాజీ ప్రధాని దేవగౌడ, అలాగే కేంద్రమంత్రులు వద్ద నుంచే. ఇంకేముంది పెద్దవారు చెబితే వినాలన్న సామెత తూ.చా., తప్పకుండా పాటించే ముఖ్యమంత్రి బదిలీ వద్దంటూ ఆపేశారు. ప్రస్తుతం అయితే బదిలీ ఆగిపోయింది కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందోనని ఉత్కంఠతో ఉన్నారు తితిదే సిబ్బంది.
 
ప్రస్తుతానికి బదిలీ ఆగిపోయిందని పండుగ చేసుకుంటున్న శ్రీనివాసరాజు తనను ఇక్కడి నుంచి పంపించడానికి ఫిర్యాదు చేసిన వారితో మాట్లాడేందుకు సిద్ధమయ్యారట. వారికి ఏం కావాలో తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారట. మొత్తం మీద తిరుమల జెఈఓ బదిలీ నిలిచిపోవడం ప్రస్తుతం తితిదేలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరికాయ కొట్టే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా..!