కొబ్బరికాయ కొట్టే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా..!
ప్రాచీనకాలంలో దేవుళ్ళకు జంతు బలలు ఇచ్చేవారు. ఇది కాలక్రమంలో గతించింది. తర్వాతి కాలంలో జంతు బలులు స్థానంలో కొబ్బరికాయ కొట్టే ఆచారం మొదలైంది. ముఖ్యంగా పెళ్ళిళ్లు, పండుగలు, కొత్త వాహనాల కొనుగోలు, భవనాలు,
ప్రాచీనకాలంలో దేవుళ్ళకు జంతు బలలు ఇచ్చేవారు. ఇది కాలక్రమంలో గతించింది. తర్వాతి కాలంలో జంతు బలులు స్థానంలో కొబ్బరికాయ కొట్టే ఆచారం మొదలైంది. ముఖ్యంగా పెళ్ళిళ్లు, పండుగలు, కొత్త వాహనాల కొనుగోలు, భవనాలు, వంతెనలు లేదా మరే పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలకు భూమి పూజ చేసే ముందు వాటిని ప్రారంభించే ముందు కొబ్బరికాయను కొట్టడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా భగవత్ ఆరాధన సంధర్భంగా నీటి కలశంపై కొబ్బరికాయ ఉంచడం సంప్రదాయంగా మారింది.
కొబ్బరికాయ మానవుని శిరస్సును పోలి ఉంటుంది. కనుక దాన్ని కొట్టడమంటే మన అహాన్ని బద్దలుకొట్టినట్టేననే అర్థం స్ఫురిస్తుంది. కొబ్బరికాయల్లోని నీళ్ళు మనలోని అంతర్గత వైఖరులకు, అందులోని తెల్లని కొబ్బరి మన మనస్సుకు ప్రాతినిథ్యం వహిస్తాయి. అంటే వీటనన్నింటినీ భగవంతుడికి అర్పిస్తున్నామన్నమాట. భగవంతుడి స్పర్శతో పవిత్రమైన మనస్సు ప్రసాదమవుతుంది. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం ఉపయుక్తమైనదే. అంటే స్వార్థం లేని సేవకు సైతం కొబ్బరికాయపై ఉండే మూడు కన్నులు శివుడికి ప్రాతినిధ్యాలు అవి మన కోరికల్ని తీరుస్తాయని చెబుతున్నారు.