Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీసస్ క్రీస్తుకి ఎంతమంది భార్యలో తెలుసా..? ప్రతి నన్ కూడా ఏసుక్రీస్తు భార్యేనా?

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో హిందూ ధర్మ వ్యాప్తికై వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. వీటిలో ఇస్కాన్ ఒకటి. ఎన్నో దేశాలలో తన కార్యక్రమాల ద్వారా ఈ సంస్థ శ్రీ కృష్ణతత్వాన్ని ప్రచారం చేస్తోంది. ఈ సంస్థ కా

జీసస్ క్రీస్తుకి ఎంతమంది భార్యలో తెలుసా..? ప్రతి నన్ కూడా ఏసుక్రీస్తు భార్యేనా?
, గురువారం, 19 జనవరి 2017 (13:00 IST)
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో హిందూ ధర్మ వ్యాప్తికై వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. వీటిలో ఇస్కాన్ ఒకటి. ఎన్నో దేశాలలో తన కార్యక్రమాల ద్వారా ఈ సంస్థ శ్రీ కృష్ణతత్వాన్ని ప్రచారం చేస్తోంది. ఈ సంస్థ కార్యకలాపాలు ఎంతగా పెరిగిపోయాయంటే ఈ ఇస్కాన్ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికి పోలాండ్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ నన్ వార్సా కోర్టులో జులై 2011లో ఫిర్యాదు చేసింది. కృష్ణుడి పదహారువేల మంది గోపికలను పెళ్ళి చేసుకున్నాడు. అలాంటి కృష్ణుని గురించి ప్రచారం చేయడం ద్వారా ఇస్కాన్ సంస్థ బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తోంది. కాబట్టి ఆ సంస్థను నిషేధించాలి అంటూ ఆ నన్ తన ఫిర్యాదులో పేర్కొంది.
 
న్యాయస్థానంలో హాజరైన ఇస్కాన్ ప్రతినిధి, గౌరవనీయులైన మెజిస్ట్రేట్ గారు, ఒక మహిళను నన్‌గా నియమిస్తున్నప్పుడు ఆమె చేత ఏమని ప్రమాణం చేయిస్తారో ఒకసారి ఆ నన్‌తో చెప్పించగలరా? అని కోరాడు. న్యాయస్థానంలో కేసు వేసిన నన్‌ను ఆ ప్రమాణాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఒక మహిళ నన్‌గా నియమితురాలైనప్పుడు చేసే ప్రమాణం ఏమిటో తెలుసా..? ఈమెను జీసస్ క్రీస్తుతో వివాహం జరిపించడమైనది అని. అప్పుడు కోర్టులో హాజరైన ఇస్కాన్ ప్రతినిధి గౌరవనీయులైన మెజిస్ట్రేట్ గారు.. శ్రీ కృష్ణుడు పదహారు వేలమందినే పెళ్ళి చేసుకున్నట్లు చెబుతారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది నన్‌లు క్రీస్తును వివాహం చేసుకున్నవారిగా ప్రకటింపబడుతున్నారు.
 
అంతేకాదు, వివాహమైన క్రైస్తవ స్త్రీ ధరించే ఉంగరం వంటిదే నన్‌‍లు కూడా ధరిస్తారు. క్రైస్తవ మతం పుట్టినప్పటి నుంచి చూస్తే ఇలాంటి నన్‌ల సంఖ్యకు లెక్కలేదు. మరి జీసస్ క్రీస్తుకు ఎంతంది భార్యలు? ఎవరు బహు భార్యాత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు? శ్రీ కృష్ణుడు జీసస్ క్రీస్తు వీరిలో ఎవరు స్త్రీలభ్రష్టుడు? ప్రపంచంలోని నన్‌ల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించాడట. దెబ్బకి న్యాయస్థానంలో ఇస్కాన్‌కి వ్యతిరేకంగా నన్ వేసిన కేసు కొట్టేశారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనీశ్వరుని ప్రభావం హనుమంతునిపై ఉండదట..! ఎందుకు?