కాలేజీ రోజుల నుంచి అతడితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నా. ఇటీవల ఇద్దరం కలిసి బీచ్‌కు వెళ్లాం. మధ్యాహ్నం కావడంతో ఎండ బాగా కాస్తోంది. గొడుగు తీసి వేసుకున్నాను. అతడిని కూడా దాని కిందకు రమ్మన్నాను. అతడు వచ్చిన 5 నిమిషాల తర్వాత గొడుగును కొద్దిగా కిందకు వంచి గబుక్కున నా ఎదపై అతడి ముఖాన్ని ఆనించి ఏదేదో చేశాడు. ఈ హఠత్పరిణామంతో నేను అదిరిపోయాను కానీ అతడిని ఏమీ అనలేకపోయాను.
అతడు ఆ పని చేస్తుంటే ఏదో తెలియని హాయి, మత్తు ఆవహించింది. చాలా బావున్నట్లనిపించడంతో కొద్దిసేపు అలాగే ఏమీ మాట్లాడలేదు. ఐతే ఎవరయినా వస్తారేమోనన్న భయంతో అతడిని నెట్టివేసాను. అతడు బిక్కమొహం వేశాడు. ఆ తర్వాత వెంటనే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను.
కానీ అతడలా చేసిన దగ్గర్నుంచి ఏవో కోర్కెలు కలుగుతున్నాయి. మళ్లీ అలా వుంటే బాగుండు అనిపిస్తోంది. కానీ పెళ్లి కాకుండా ఇలాంటివి తప్పని తెలుసు. ఈ కోర్కెలను మనసు నుంచి తరిమేయడమెలా...?
ఇలాంటి పరిస్థితులు కొంతమంది ప్రేమికుల విషయంలో జరుగుతుంటాయి. కౌగిళ్లు, ముద్దులు వంటివి చోటుచేసుకుంటాయి. కానీ వ్యవహారం శృతి మించేవరకూ వెళ్లిందంటే అతడికి మీరు చాలా చనువు ఇచ్చినట్లు అర్థమవుతుంది. యౌవనంలో ఇలాంటి అనుభవాలను చవిచూస్తే మళ్లీమళ్లీ కావాలనిపించినప్పటికీ వాటికి ఖచ్చితంగా కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. ముందుగా కెరీర్‌పై దృష్టి సారించండి. అలాంటి ఆలోచనల నుంచి మీరు బయటపడక తప్పదు. పెళ్లికి ముందు ఇలాంటి సంబంధాలు అనేక ఇబ్బందులను కలిగిస్తాయి. కనుక ఆ దిశగా చేస్తున్న ఆలోచనలకు ఫుల్ స్టాప్ వేయండి. వీలైతే కొన్నాళ్లపాటు మీ బంధువుల ఇంటికి వెళ్లండి.