Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనిదోష నివారణకు ఇలా చేస్తే..?

శనిదోష నివారణకు ఇలా చేస్తే..?
, శుక్రవారం, 23 నవంబరు 2018 (13:33 IST)
హనుమంతుడు శనివారం నాడు జన్మించినందున ఆ రోజు హనుమ భక్తులు స్వామివారిని విశేషంగా పూజిస్తారు. పురాణ ఇతిహాసాలు కూడా హనుమంతుని కొలవడానికి శనివారం ప్రశస్తమైనదని పేర్కొన్నాయి. ఈ కారణంగా దేవాలయాలలో ప్రతి శనివారం ప్రాతఃకాలం మూడున్నర గంటల నుండి అర్థరాత్రి దాటాక ఒంటిగంట వరకూ మూయకుండా భక్తులకోసం తెరచి ఉంచుతారు.
 
అలాగే మంగళవారంనాడు సైతం ప్రాతఃకాలం గం. 3-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 9.00 గంటల వరకూ తెరచి ఉంచుతారు. మిగిలిన రోజులలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంట వరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ భక్తులకోసం తెరచి ఉంచుతారు.
 
శనివారం నాడు వేకువ జామన లేచి స్నానం మాచరించి పూజగదిని శుభ్రం చేసి హనుమకు నచ్చిన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి స్వామివారి నామాన్ని స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. ఇలా ప్రతి వారం చేస్తే కోరిక వరాలు తక్షణమే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శనిగ్రహదోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం లేదా మంగళవారం నాడు హనుమంతుని పూజలు చేస్తే దోషాలు తొలగిపోతాయి. హనుమకు రాముడంటే పిచ్చి ప్రాణం. కనుక రాముల వారిని ఆరాధించినా కూడా దోషాల నుండి విముక్తి లభిస్తుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిల్చున్నపుడు కోపం వస్తే ఏం చేయాలి?