Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీనేజ్‌లో ఏదో తెలియని ఆందోళన... ఇలా చేస్తే...

టీనేజ్ అమ్మాయిలు అంటేనే నవ్వులు చిందిస్తూ, తుళ్లుతూ అందరినీ ఆటపట్టిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో టీనేజర్లు ఏదో టెన్షన్‌లతో బాధపడుతున్నారు. ఈ యంగ్ ఏజ్‌లో అమ్మాయిలు తీవ్ర ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుత

Advertiesment
teen
, గురువారం, 14 జూన్ 2018 (17:52 IST)
టీనేజ్ అమ్మాయిలు అంటేనే నవ్వులు చిందిస్తూ, తుళ్లుతూ అందరినీ ఆటపట్టిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో టీనేజర్లు ఏదో టెన్షన్‌లతో బాధపడుతున్నారు. ఈ యంగ్ ఏజ్‌లో అమ్మాయిలు తీవ్ర ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారంటే అందుకు ముఖ్యాకారణం వాళ్లు ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించడమేనని కారణమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
 
అటువంటి వారు ఆనందం, ఉత్సాహం, బాధ ఏది కలిగినా దాన్ని పట్టలేరని, భావోగ్వేగాలను అదుపులో ఉంచుకోలేనప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. జీవితం మంచీ చెడూ, ఆనందం, విషాదం వంటి వాటిని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
 
సమస్య చిన్నది కావచ్చు లేదా పెద్దది కావచ్చు మీకు మీరే తీవ్రంగా ఆలోచించి భయపడటం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆందోళనతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అలాకాకుండా ఆ విషయాన్ని అమ్మకో, స్నేహితురాలికో చెప్పి చూడాలి. కచ్చితంగా మీకు ఓ మంచి మార్గం దొరుకుతుంది.
 
కొన్ని సందర్భాలలో తెలియని ఆందోళన, ఒత్తిడి ఏర్పడుతుంది. అటువంటి సమయాల్లో మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తుంది. అయితే అది సహజమేనని గుర్తించాలి. అవతలి వారు మీ మాటను పట్టించుకోవడం లేదనుకోవడం కంటే, మీరు ఆ విషయాన్ని వాళ్లకి అర్థమయ్యేలా చెప్పాలి. మీ మాటల్ని ఎవరూ సమర్థించకపోవడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని సానుకూల దృక్పథంతో ఆలోచించాలి.
 
యంగ్ ఏజ్ అమ్మాయిల్లో ఒత్తిడికి ప్రధాన కారణం ఆత్మన్యూనతే ప్రధాన కారణం. ఏ విషయంలోనైనా పోటీతత్వం ఉండాలి. కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రాథమిక నియమాన్ని మరిచిపోవద్దు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే అవతలి వారు విజయాలను చూసినప్పుడు వారి నుంచి ఏం నేర్చుకోవాలని ఆలోచించాలి. అది మంచి విషయమైతే మాత్రమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టూత్ పేస్టులతో పేగు కేన్సర్.. నిజమా?