Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టూత్ పేస్టులతో పేగు కేన్సర్.. నిజమా?

ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకుని దంతాలను శుభ్రం చేసుకుంటారు. ఇందుకోసం మనకు ఇష్టమైన కంపెనీ టూత్‌పేస్టును వినియోగిస్తుంటాం. నిద్రలేవగానే దుర్వాసనను పోగొట్టి నోట్లోని బ్యాక్టీరియాను తరిమేసి పళ్లన

Advertiesment
టూత్ పేస్టులతో పేగు కేన్సర్.. నిజమా?
, గురువారం, 14 జూన్ 2018 (16:28 IST)
ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకుని దంతాలను శుభ్రం చేసుకుంటారు. ఇందుకోసం మనకు ఇష్టమైన కంపెనీ టూత్‌పేస్టును వినియోగిస్తుంటాం. నిద్రలేవగానే దుర్వాసనను పోగొట్టి నోట్లోని బ్యాక్టీరియాను తరిమేసి పళ్లను శుభ్రంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ టూత్‌పేస్టులను వినియోగిస్తుంటాం.
 
అయితే, టూత్‌పేస్టులో ట్రైక్లోసన్‌ అనే బ్యాక్టీరియాను చంపే పదార్థం ఉంటుందట. అది కాసింత కడుపులోకి వెళ్లినా.. పేగుల్లో ఉండే ఆరోగ్యకర, అవసరమైన బ్యాక్టీరియాను చంపేయడం వల్ల పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఆమ్‌హెర్ట్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 
 
ఇందుకోసం వారు తొలుత ఎలుకలపై ప్రయోగం చేశారు. ఎంపిక చేసిన ఎలుకలకు ట్రైక్లోసన్‌ తినిపించారు. ఆ తర్వాత ఆ ఎలుకలను పరిశీలించగా వాటిలో జీర్ణవ్యవస్థకు అవసరమయ్యే బ్యాక్టీరియా (గట్‌ బ్యాక్టీరియా) చనిపోయినట్లు గుర్తించారు. 
 
అమెరికాలో కొన్ని ఉత్పత్తులపై నిషేధం ఉన్నా మిగతా దేశాల్లో ఈ రసాయనంపై ఎక్కడా నిషేధం లేదని వివరించారు. ఇప్పటికే ఈ రసాయనం ప్రపంచం నలువైపులా సబ్బులు, టూత్‌పేస్టుల రూపంలో వ్యాపించిందని, దీనివల్ల మరింత నష్టం జరగకముందే తక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికాగో సెక్స్ స్కామ్ : తెలుగు నిర్మాత అరెస్టు.. ఖాకీలకు ఉప్పందించిన హీరోయిన్