ఒక మనిషికి ఎంత విజ్ఞానం ఉన్నదన్నది ముఖ్యం కాదు..
తన విజ్ఞానం అతడు ఎలా ఉపయోగించుకుంటాడన్నది ముఖ్యం..
అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది...
సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ ఉంటుంది..
నీ మాటలను, చేతలను పొగిడేవారికంటే..
నీ తప్పిదాలను మృదువుగా వివరించేవారే నమ్మ దగిన వారు..
చిరునవ్వు కంటే వేగంగా మరేవీ..
ఒకరి నుండి ఇంకొకరికి సోకలేవు..
భయపడడం ఎప్పుడు మానేస్తామో..
అప్పుడే మన జీవితం మొదలైనట్లు..