Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనీశ్వరునికి నువ్వులు, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే.?

సూర్యుడు వెళ్లలేని చోట శనీశ్వరుడు కొలువైవుంటాడు. అలాగే శనికి ప్రీతికరమైన ధాన్యాల్లో నువ్వులు ఒకటి. ఇక ద్రవాల్లో నువ్వుల నూనె అంటే ఇష్టం. కాటుక, నీలిరంగు కలిపిన రంగులు ఇష్టం. అందుకే నలుపు, నీలం కలిపిన

Advertiesment
Sanaischara
, బుధవారం, 19 జులై 2017 (16:56 IST)
ఆధునికత, పాశ్చాత్య పోకడల కారణంగా మనుషులు మారడంతో పాటు పంచభూతాల్లోనూ మార్పులు సర్వసాధారణంగా మారిపోయింది. సంప్రదాయాలు మరుగునపడిపోతున్నప్పటికీ కొన్ని ఆచారాలను పాటించడం జరుగుతూనే వుంది. అందులో ఒకటి శనీశ్వరుడిని నువ్వులతో దీపమెలిగించడం... నువ్వుల నూనెను వాడటం. అయితే ఈ నూనెను, నువ్వుల్ని ఎందుకు వాడుతారో తెలుసుకుందాం.. నువ్వుల నుంచి తీసే నువ్వుల నూనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని చాలామంది ఉపయోగించట్లేదు. కానీ ఈ నూనె రక్తంలో కొవ్వును చేరనివ్వదు. అలాగే కొవ్వును తొలగిస్తుంది. ఈ నూనెను ప్రస్తుతం ఆహారంలో చేర్చుకోవట్లేదు. దీనికి బదులు అనేక నూనెలు వాడుకలోకి వచ్చేశాయి. 
 
పూర్వం నాణ్యత గల నువ్వుల నూనెను మహిళలకు తాగేందుకు ఇస్తారు. ఇలా చేస్తే గర్భసంచిలోని వ్యర్థాలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నువ్వులనూనెతో తలంటు స్నానం చేస్తే కంటికి ఎంతో మేలు. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే నువ్వులను శనీశ్వరుడిని దీపంగా ఎందుకు వెలిగిస్తారంటే.. శనీశ్వరుడికి పశ్చిమ దిక్కు అంటే ఇష్టం. వెలుతురు లేని చోట శనీశ్వరుడు ఉంటాడు.
 
సూర్యుడు వెళ్లలేని చోట శనీశ్వరుడు కొలువైవుంటాడు. అలాగే శనికి ప్రీతికరమైన ధాన్యాల్లో నువ్వులు ఒకటి. ఇక ద్రవాల్లో నువ్వుల నూనె అంటే ఇష్టం. కాటుక, నీలిరంగు కలిపిన రంగులు ఇష్టం. అందుకే నలుపు, నీలం కలిపిన దుస్తులను శనివారం నాడు శనీశ్వరుడికి సమర్పిస్తే శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది. ఇంకా నువ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీవితంలో అనుభవాన్ని నేర్పించే శనీశ్వరుడిని నువ్వులు, నువ్వుల నూనెతో పూజ కనుక చేస్తే శనిదోషాలు దూరమవుతాయి. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యం ఇష్టం. ఈ తరహాలో శనికి నువ్వులంటే ఇష్టం. అందుకే నువ్వులతో దీపమెలిగించి.. ఆ నూనెను దీపారాధనకు వాడే వారిపై తన ప్రభావాన్ని శనీశ్వరుడు తగ్గించుకుంటాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా 2 గంటల్లోనే దర్శనం... కాలినడక భక్తులకు...