Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా 2 గంటల్లోనే దర్శనం... కాలినడక భక్తులకు...

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం చాలా కష్టమన్నది చాలామందికి తెలుసు. సర్వదర్శనానికి వెళ్ళే భక్తులు గంటల తరబడి కంపార్టుమెంట్లలో కూర్చోవాలి. నడక దారి నుంచి వచ్చిన భక్తులైతే కాళ్ళ నొప్పితోనే కంపార్టుమెంట్లలో వారు కూడా స్వామి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటార

తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా 2 గంటల్లోనే దర్శనం... కాలినడక భక్తులకు...
, బుధవారం, 19 జులై 2017 (15:09 IST)
తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం చాలా కష్టమన్నది చాలామందికి తెలుసు. సర్వదర్శనానికి వెళ్ళే భక్తులు గంటల తరబడి కంపార్టుమెంట్లలో కూర్చోవాలి. నడక దారి నుంచి వచ్చిన భక్తులైతే కాళ్ళ నొప్పితోనే కంపార్టుమెంట్లలో వారు కూడా స్వామి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటారు. 
 
అలాంటి పరిస్థితిని అధిగమించి భక్తులకు త్వరితగతిన దర్శనభాగ్యం లభించేందుకు నూతన తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వారాంతంలో కాలినడక దివ్యదర్శనం టోకెన్లను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత దివ్యదర్శనం టోకెన్లను కుదిస్తూ వచ్చారు.
 
గురు, శుక్ర, శనివారాల్లో అయితే పూర్తిగా రద్దు చేయాలనుకున్నప్పటికీ దివ్యదర్శనం టోకెన్లను తిరిగి ప్రారంభించారు. అది కూడా రెండు గంటల్లోనే కాలినడక భక్తులకు దర్శనం పూర్తయ్యేలా చూడనున్నారు. వారాంతంలో రద్దు చేసిన టిక్కెట్లను తిరిగి ఇవ్వనున్నారు. అది కూడా 20 వేల టోకన్లు మాత్రమే. 
 
అలిపిరి పాదాల మండం నుంచి నడిచి వెళ్లే భక్తులకు 14వేలు, శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్లే భక్తులకు 6 వేల టోకన్లను ఇవ్వనున్నారు. మొదట్లో తితిదే తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడినా ఆ తరువాత తప్పును సరిదిద్దుకుని టోకన్లను ఇవ్వడమే కాకుండా ఎంత రద్దీ ఉన్నా రెండు గంటల్లోనే స్వామివారి దర్శనాన్ని కల్పించే విధంగా తితిదే చర్యలు తీసుకోవడం భక్తుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ రాశి ఫలితాలు(19-07-2017)... అధికారుల నుంచి మెప్పు....