మీ రాశి ఫలితాలు(19-07-2017)... అధికారుల నుంచి మెప్పు....
మేషం : ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పుపొందుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఓర్పు, సర్దుబాటు ధోరణితోనే సర్దుకుంటాయి. స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలు, పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండ
మేషం : ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పుపొందుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఓర్పు, సర్దుబాటు ధోరణితోనే సర్దుకుంటాయి. స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలు, పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి.
వృషభం : విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి చికాకులు అధికమవుతాయి. మీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువు చేజారిపోయే ఆస్కారం ఉంది. రవాణా రంగాల వారికి ఆందోళనలు వంటివి అధికమవుతాయి.
మిథునం : వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది. స్త్రీల ఆరోగ్యంలో సంతృప్తికానరాదు.
కర్కాటకం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళకువ వహించండి. బంధుమిత్రుల కలయికతో నూతన ఉత్సాహం కానవస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ఉన్నతస్థాయి ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
సింహం : మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కన్య : కిరాణా, ఫ్యాన్సీ, కొబ్బరి, పూల, పండ్ల వ్యాపారులకు శుభదాయకం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్న బలమైన కోరిక నెరవేరుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
తుల : ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. కొన్ని సమస్యలు మబ్బు వీడినట్టు వీడిపోవును. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు దూరప్రదేశంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. డాక్టర్లు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృశ్చికం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. శారీరక శ్రమ, మానసికాందోళనల వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలు టీవీ చానెల్స్ కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో రాణిస్తారు.
ధనస్సు : స్థిరచరాస్తుల విషయంలో సంతృప్తికానవస్తుంది. మిత్రుల కలయికతో గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. ఖర్చులు పెరిగినా ఆర్థికస్థితిలో ఏమాత్రం లోటుండదు. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం.
మకరం : వ్యాపార రంగాల్లోని వారికి గణనీయమైన అభివృద్ధి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోనూ అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది.
కుంభం : ఫ్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు అనుకూలం. మీ శ్రీమతి వైఖరిలో మీరు ఆశించిన మార్పు సంభవిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. విదేశాలు వెళ్లటానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు.
మీనం : రవాణా, ఆటోమొబైల్ రంగాల్లో వారికి అనుకూలమైన కాలం. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. విద్యా సంస్థల్లో వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి.