Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రహ శాంతి.... చంద్రగ్రహ దోష శాంతికి ఏం చేయాలి?

గ్రహ దోషం వుంటే శాంతి చేయించాలంటారు జ్యోతిష్కులు. మేష, సింహ, ధనుర్మాసాల్లో సోమ, మంగళ, గురువారాల్లో రోహిణి, హస్తా, శ్రవణ నక్షత్రాలు కలిసి వచ్చిన నాడు వైష్ణవ దేవాలయ పూజారిని రాత్రి 7.30 గంటలకు గృహానికి పిలిపించాలి. గృహ మధ్యలో ఆరు మూరల తెల్లని వస్త్రం ప

Advertiesment
Graha Shanti
, శుక్రవారం, 27 అక్టోబరు 2017 (19:18 IST)
గ్రహ దోషం వుంటే శాంతి చేయించాలంటారు జ్యోతిష్కులు. మేష, సింహ, ధనుర్మాసాల్లో సోమ, మంగళ, గురువారాల్లో రోహిణి, హస్తా, శ్రవణ నక్షత్రాలు కలిసి వచ్చిన నాడు వైష్ణవ దేవాలయ పూజారిని రాత్రి 7.30 గంటలకు గృహానికి పిలిపించాలి. గృహ మధ్యలో ఆరు మూరల తెల్లని వస్త్రం పరిచి ఆరు దోసిళ్ళు బియ్యం పోసి ఆ రాశిపై వెండిచెంబు లేక రాగి చెంబును కలశంగా స్థాపించాలి. 
 
కలశంపై అష్టదిక్కులకు ఎనిమిది తమలపాకులు పెట్టి టెంకాయ పెట్టి వాయువ్య ముఖముగా విష్ణు స్వరూపమగు మూడు పసుపు కుంకుమ రేఖలు నిలువుగా పెట్టి ఆ కలశమును వాయువ్య దిక్కున పెట్టాలి. కలశం ఎదురుగా ఎవ్వరూ కూర్చొనరాదు.
 
ఈశన్య ముఖంగా విష్ణు దేవాలయ పూజారి, నైరుతి దిశాముఖంగా గృహస్తు అతని భార్య కూర్చొనాలి. మమశనివర్గజాతస్య.. లగ్నజాతకానుసారేన.. స్థానస్థితి చంద్ర దోష పరిహారార్థం శతృరుణరోగద పాపపరిహారార్థం అని సంకల్పించి.. ఆ కలశమునకు శ్రీసూక్తం, చంద్ర గ్రహ మంత్రాలను ఆవాహన చేయాలి. 
 
చంద్ర గ్రహసహిత శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమ: పంచామృత అభిషేకం కరిష్యే అని చెప్పి కలశము ముందు భాగాన పెద్ద వెండి లేక రాగి లేక ఇత్తలి తట్ట పెట్టి పంచామృతములతో అభిషేకించి శ్రీసూక్తముతో అభిషేకించి లక్ష్మీ సహస్రనామ, లక్ష్మీ అష్టోత్తరము, చంద్ర గ్రహ అష్టోత్తరములతో పూజ చేయాలి.
 
ఇట్లు రాత్రి తొమ్మిది గంటల వరకు తెల్లని పువ్వులతో గంధ అక్షతలతో పూజించి ధూప, దీప, నైవేద్యం, మంగళహారతులు ఇవ్వాలి. పాలు చక్కెర లేక పొంగలి లేక పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. పూజా కార్యక్రమం అయ్యవారికిచ్చు దాన కార్యక్రమము రాత్రి 9 గంటల లోపు పూర్తి చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయం పూట కాకులకు ఆహారం పెడితే.. లాభాలేంటో తెలుసా?