Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవగ్రహాల శక్తి గురించి మీకు తెలుసా? గ్రహశాంతి అంటే?

గ్రహానికి శాంతి చేయించుకోమని జ్యోతిష్యులు చెప్పారా? గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఫలితం చేకూరుతుంది అని తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. మనకు నవగ్రహాలున్నాయి. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బ

Advertiesment
నవగ్రహాల శక్తి గురించి మీకు తెలుసా? గ్రహశాంతి అంటే?
, గురువారం, 2 ఫిబ్రవరి 2017 (12:01 IST)
గ్రహానికి శాంతి చేయించుకోమని జ్యోతిష్యులు చెప్పారా? గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఫలితం చేకూరుతుంది అని తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. మనకు నవగ్రహాలున్నాయి. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.

ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు. నవగ్రహాల్లో మూడోవాడైన రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు. 
 
గురువును ఆరాధిస్తే.. బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం.. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు. 
 
ఇక బుధ గ్రహం బుద్ధిమంతుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగలే సమర్థుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. కేతువును పూజిస్తే.. తీర్థయాత్రలకు వెళ్తారు. లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని.. దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు. కేతువు తర్వాతి గ్రహం శుక్రుడు. శుక్రాచార్యుడు. ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు. సంతానాన్ని ఇవ్వగలుగుతాడు. 
 
ఇక గ్రహ శాంతి అంటే?
గ్రహాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే.. గ్రహదోషమని భావించాలి. అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్యుల సంప్రదించి వారి సూచనల మేరకు, ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు. అయితే గ్రహశాంతి చేయించుకోవడం ద్వారా సదరు గ్రహ ప్రభావంతో ఏర్పడే బాధలు పూర్తిగా తొలగిపోవని.. ఆ బాధల నుంచి ఉపశమనం మాత్రమే లభిస్తుందని.. గ్రహ ప్రభావం కాస్త తగ్గుతుందని జ్యోతిష్కులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్య మండలం నుంచి మాటలు వినబడతాయ్... 5097 సంవత్సరంలో... బ్రహ్మంగారి కాలజ్ఞానం