Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 11 నుంచి మార్చి 17, 2018 వరకు మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో శని, కుజులు, మకరంలో కేతువు. కుంభంలో రవి, మీనంలో బుధ, శుక్రులు, ధనస్సు, మకర, కుంభ, మీనంలలో చంద్రుడు. 14న రవి ధనుర్ ప్రవేశం. ముఖ్యమైన పనులకు త్రయోదశి, గురువారం శుభదాయకం. నిత్యావసర వస్తువుల ధరలు అధికమవుత

Advertiesment
మార్చి 11 నుంచి మార్చి 17, 2018 వరకు మీ వార రాశి ఫలితాలు
, శనివారం, 10 మార్చి 2018 (21:48 IST)
కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో శని, కుజులు, మకరంలో కేతువు. కుంభంలో రవి, మీనంలో బుధ, శుక్రులు, ధనస్సు, మకర, కుంభ, మీనంలలో చంద్రుడు. 14న రవి ధనుర్ ప్రవేశం. ముఖ్యమైన పనులకు త్రయోదశి, గురువారం శుభదాయకం. నిత్యావసర వస్తువుల ధరలు అధికమవుతాయి. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఖర్చులు పెరిగినా ఇబ్బంది వుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. గృహమార్పు కలిసివస్తుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. బంధుమిత్రుల వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. శనివారం నాడు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. దళారులు, ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు ఓ కొలిక్కి వస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం, నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. అపరిచితులను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. మీ ప్రతిపాదనలకు ఏమంత స్పందన వుండదు. ఆది, సోమవారాల్లో ఎదుటివారి వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆశావహ దక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పరిచయస్తులు ధన సహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. రుణ ఒత్తిడి తొలగిపోతుంది. వివాహయత్నాలు ముమ్మరంగా సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మంగళ, బుధవారాల్లో మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు హోదా మార్పు స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చీటికి మాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆప్తుల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆది, గురువారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. పెట్టుబడులకు తరుణం కాదు. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల కలయిక సంతృప్తినిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. షాపుల స్థలమార్పు శ్రేయస్కరం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తంచేయండి. మంగళ, శనివారాల్లో ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. వేడుకలు శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. విలువైన కానుకలు చదివించుకుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. విద్యార్థుల్లో ఆందోళన తొలగుతుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు
శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధువులకు ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా సన్నిహితులకు లాభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అయినవారికి సాయం అందిస్తారు. ఖర్చులు విపరీతం. వాహనం, విలాస, వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అకౌంట్స్ కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ప్రయాణం కలిసివస్తుంది. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు. ప్రకటనలను విశ్వసించవద్దు. దళారులు తప్పుదారి పట్టించే ఆస్కారం వుంది. శుభకార్యాలు, ఆహ్వానాలపై దృష్టి పెడతారు. యాదృచ్ఛికంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారాల్లో మీదే పైచేయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనంమితంగా వ్యయం చేయండి. శనివారం పెద్దమొత్తం ధనసహాయం తగదు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. వేధింపుల అధికారి బదిలీ సంతోషాన్నిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పనుల సకాలంలో పూర్తి కాగలవు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచనలు స్ఫురిస్తాయి. దళారులను విశ్వసించవద్దు. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు తగదు. స్నేహితుల సలహా తీసుకోండి. పిల్లల ఉన్నత చదువుల్లో దృష్టి సారిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. ఉద్యోగస్తులు, అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం 
ఈ వారంలో కొన్ని ఇబ్బందులు తొలగి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఖర్చులు ఫర్వాలేదననిపిస్తాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కొంటారు. ముఖ్యమైన వ్యక్తుల ఇంటర్వ్యూలు సాధ్యంకాదు. పట్టుదలతో వ్యవహరించండి. త్వరలో శుభవార్త వింటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. గృహ మార్పు, చేర్పులకు అనుకూలం. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వృత్తుల వారికి పురోభివృద్ధి. రిప్రజెంటివ్‌లు టార్గెట్లను అధికమిస్తారు. ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి సామాన్యం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలకు హాజరవుతారు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయు. సాధ్యంకాని హామీలివ్వవద్దు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. ఖర్చులు అధికం. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు సంభవం. ఆది, సోమ వారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఆత్మీయులతో బలపడతాయి. పదవులు చేజిక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీ యోగం, ధనలాభం. వేడుకలు, విందుల్లో అత్యుత్సాహం తగదు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
మనోధైర్యంతో మెలగండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్య యత్నం ఫలిస్తుంది. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి ఎదుటివారికి అపోహ కలిగిస్తుంది. విశ్రాంతి అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ద్వారా శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు ధనలాభం, పదవీయోగం, ఆశావహా దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ప్రకటనలను విశ్వసించవద్దు. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. సంతానం భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. గురు, శుక్రవారాల్లో పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదాపడతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయు. మానసికంగా స్థిమితపడుతారు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనులు సానుకూలవుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం మీ రాశి ఫలితాలు... కానివేళలో బంధువుల రాక ...