Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-04-2020 నుంచి 25-04-2020 వరకు మీ వార రాశిఫలితాలు

Advertiesment
19-04-2020 నుంచి 25-04-2020 వరకు మీ వార రాశిఫలితాలు
, శనివారం, 18 ఏప్రియల్ 2020 (16:27 IST)
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
చాకచక్యంగా వ్యవహరించాలి. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. తొందరపాటుతనం తగదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనుల్లో ఆటంకాలెదుర్కొంటారు. ఖర్చులు సామాన్యం. స్థిరాస్తి క్రయ విక్రయంలో మెలకువ వహించండి. ఒత్తిడి, ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దల సలహా పాటించండి. బుధవారం నాడు పత్రాలు, నగదు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. పదవులు దక్కకపోవచ్చు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. పరిచయాలు బలపడతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. మీ పట్టుదల ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్ని త్వరగా నమ్మవద్దు. గురు, శుక్రవారాల్లో వ్యవహారాలు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసరజోక్యం తగదు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. ఆరోగ్యం సంతృప్తికరం. బంధువులతో సత్సంబధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాల్లో ఆటుపోట్లు ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అవకాశాలు చేజారిపోతాయి. శని, ఆదివారాల్లో ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పులు వస్తుంది. సోదరీ సోదరులతో సంత్సబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అనుకున్నది సాధిస్తారు. వ్యతిరేకులకు సన్నిహితులవుతారు. సోమ, మంగళవారల్లో అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఈవారం అన్ని విధాలా యోగదాయకమే. హామీలు నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడివుంటుంది. పనులలో సతమతమవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతులకు కొత్త ఆలోచన స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు అనుకూలం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వృత్తుల వారికి సామాన్యం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఖర్చులు విపరీతం. చేతిలో ధనం ఉండదు. పొదుపు ధనం గ్రహిస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపకాలు అధికమవుతాయి. పనులు సానుకూలంగా పూర్తిచేస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు ఉంటాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. కొత్త ప్రదేశాల సందర్శనకు సన్నాహాలు చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆర్థిక ఇబ్బంది లేకున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. నిస్తేజానికి లోనవుతారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. బుధ, గురువారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. అవివాహితులకు శుభయోగం. గృహమార్పు ఫలితం అంతగా ఉండదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. బుధ, గురువారాల్లో ప్రముఖుల సందర్శనీయం వీలుపడదు. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
ఆదాయ, వ్యయాలకు ఏమాత్రం పొంతనవుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడివుంటుంది. వ్యూహాత్మకంగా ముందుకుసాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. శుక్రవారం నాడు అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. వేడుకకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఏజెన్సీలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ప్రేమానుబంధాలు బలపడతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ఒక వ్యవహారం కలిసివస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. నగదు పత్రాలు జాగ్రత్త. శని, ఆదివారాల్లో చెల్లింపుల్లో మెలకువ వహించండి. మీదైన రంగంలో రాణిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దంపతుల మధ్య అమరికలు తగదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, తిప్పట అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
మనోధైర్యంతో వ్యవహరించండి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదాపడతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. సోమ, మంగళవారాల్లో అభియోగాలు, విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పట్టుదలతో వ్యవహరించాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. నిరుద్యోగులకే ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఆశావహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ప్రతికూలతలు నిదానంగా సద్దుకుంటాయి. సంప్రదింపులు వాయిదాపడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. గురు, ఆదివారాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆధిపత్యం ప్రదర్శిచవద్దు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పెద్దల సలహా పాటించండి. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
కొత్త  యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కొత్త వారితో మితంగా సంభాషించండి. పరిస్థితుల మెరుగుపడుతాయి. అనుకున్నది సాధిస్తారు. మొండిబాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ఆప్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం చేయండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సోమ, మంగళవారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18-04-2020 శనివారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని ఆరాధించినా...