Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివునికి పసుపు, బిల్వపత్రాలు, పంచదారతో అభిషేకం చేయిస్తే..?

శివునికి పసుపు, బిల్వ పత్రాలతో అభిషేకం చేయిస్తే.. ఐశ్వర్యాలు చేకూరుతాయి. శివునికి పసుపు, బిల్వ పత్రాలతో అభిషేకం చేయిస్తే రుణాబాధలు తొలగిపోతాయి. ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. పసుపుతో చ

శివునికి పసుపు, బిల్వపత్రాలు, పంచదారతో అభిషేకం చేయిస్తే..?
, శనివారం, 14 జులై 2018 (15:52 IST)
శివునికి పసుపు, బిల్వ పత్రాలతో అభిషేకం చేయిస్తే.. ఐశ్వర్యాలు చేకూరుతాయి. శివునికి పసుపు, బిల్వ పత్రాలతో అభిషేకం చేయిస్తే రుణాబాధలు తొలగిపోతాయి. ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. పసుపుతో చేసే అభిషేకం ద్వారా వ్యాధులు తొలగిపోతాయి. వివాహ దోషాలుండవు. భోగభాగ్యాలు చేకూరుతాయి. భూలాభం ప్రాప్తిస్తుంది. 
 
అలాగే పంచకవ్యంతో అభిషేకం చేయించే వారికి సకలశుభాలు చేకూరుతాయి. అలాగే శివునికి పంచామృతంతో అభిషేకం చేయిస్తే.. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. నేతితో శివుని లింగానికి అభిషేకం చేస్తే.. మోక్షం సిద్ధిస్తుంది. పాలతో అభిషేకం చేస్తే.. ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివలింగాభిషేకం చేయిస్తే.. చిన్నారులకు స్వామివారి అనుగ్రహం, ఆశీస్సు లభిస్తుంది. 
 
శివునికి తేనెతో అభిషేకం చేయిస్తే.. సంగీత కళాకారులుగా ఎదుగుతారు. శివునికి బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే.. రుణబాధలుండవు. చెరకు రసంతో శివునికి అభిషేకం చేయిస్తే శత్రుబాధ వుండదు. అలాగే ఘంటసాల క్షేత్రాన్ని దర్శించుకుంటే అష్టాదశ పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకున్న ఫలితం చేకూరుతుంది. 
 
శివునికి నిమ్మరసంతో అభిషేకం చేస్తే.. మృత్యుభయం తొలగిపోతుంది. దారిద్ర్యం తొలగిపోతుంది. 
కొబ్బరిబోండాంతో శివునికి అభిషేకం చేయిస్తే.. ప్రశాంతత చేకూరుతుంది. 
అన్నాభిషేకం చేయిస్తే.. రాజ్యప్రాప్తి, ఆనందమయ జీవితం లభిస్తుంది. 
పంచదారతో శివునికి అభిషేకం చేయిస్తే- విరోధులుండరు 
గంగాజలంతో అభిషేకం- శాంతినిస్తుంది. 
 
నువ్వుల నూనెతో శివాభిషేకం చేస్తే.. అనారోగ్యాలు దరిచేరవు, మృత్యుభయాలుండవు. 
ఆవునేతితో శివాభిషేకం చేయిస్తే.. ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. 
ద్రాక్షలతో అభిషేకం- సకల కార్యాలు దిగ్విజయం అవుతాయి. 
చందనం నీరుతో అభిషేకం.. సంతానానికి మేలు.
రుద్రాభిషేకం చేయిస్తే.. మహా ఐశ్వర్యం చేకూరుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ఆలయం ఐదు రోజులు కాదు.. తొమ్మిది రోజులు మూతపడనుందట..