అక్టోబరు 1 మీ రాశి ఫలితాలు ఇలా వున్నాయి... (01-10-2018)
మేషం: సన్నిహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి.
మేషం: సన్నిహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి. మీ సహాయం పొంది మీ మీద అభాండాలు వేసేవారు అధికమవుతున్నారని గమనించండి. ఐరన్, సిమెంట్ కలప వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృషభం: ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. బంధుమిత్రులు మీ వైఖరి తప్పుపడతారు. ఉపాధ్యాయులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు తరచు సభసమావేశాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరిగినా సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాగలదు.
మిధునం: ఇతరుల తప్పిదాలను తేలికగా తీసుకుని మీ ఔన్నత్యాన్చి చాటుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు బయటి తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. స్త్రీల మతిమరుపు నిర్లక్ష్యం వలన విలువైన వస్తువుల చేజారిపోయే ఆస్కారం ఉంది. మీ మాటకు గౌరవం లభిస్తుంది.
కర్కాటకం: పత్రికా మీడియా రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పెద్దలతో పరస్పర ఏకీభావం కుదురుతుంది. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. మీ విరోధులు వేసే పథకాలు త్రిప్పికొట్ట గలుగుతారు. ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం.
సింహం: తోటివారి సహాకారం వలన మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ధనం బాగా అందుటవలన ఏ కొంతయినా నిల్వచేయగలుగుతారు. ఉపాధ్యాయులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడికానవస్తుంది. విద్యార్థులు బహుమతులు అందుకుంటారు.
కన్య: కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వలన అశాంతికి గురవుతారు. హోటల్ తినుబండారాల వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. మీ కళత్ర మెుండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. దూరప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు.
తుల: అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు బహుమతులను అందుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. రాజకీయనాయకులకు దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరమని గమనించండి.
వృశ్చికం: పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఒక అనుభవం మీకెంతే జ్ఞానాన్ని ఇస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. రిప్రజెంటేటివ్‌లకు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద ఆలస్యంగానైనా పూర్తిచేస్తారు.
ధనస్సు: విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. కొంతమెుత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. వితండవాదం, భేషజాలగు దూరంగా ఉండడం ఉత్తమం.
మకరం: మీడియా రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహులు సాగిస్తారు.
కుంభం: విద్యార్థులు మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. మీ సంతానం పట్ల శ్రద్ధాసక్తులు కలిగి మెళకువ వహించండి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండడం మంచిది.
మీనం: ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించండి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం కాగలదు. ఉపాధ్యాయులు బహుమతులను స్వీకరిస్తారు. రియల్ ఎస్టేల్ రంగాలవారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కళాకారులకు అనుకూలం.