Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-12-2017 సోమవారం.. మీ రాశి ఫలితాలు..

మేషం: ఆలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అభిప్రాయాలు గుట్టుగా వుంటి ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీ పలుకుబడి, వ్యవహార దక్షతతో

Advertiesment
Daily Predictions
, సోమవారం, 25 డిశెంబరు 2017 (06:13 IST)
మేషం: ఆలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అభిప్రాయాలు గుట్టుగా వుంటి ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీ పలుకుబడి, వ్యవహార దక్షతతో కొన్ని అనుకున్నది సాధిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
వృషభం: బంధుమిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ, సాంఘిక, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.
 
మిథునం: ఫ్యాన్సీ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. విందులలో పరిమితి పాటించండి. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మీ సంతానంపై బరువు బాధ్యతలు పెరుగుతాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు, పనిభారం అధికమవుతాయి. 
 
కర్కాటకం: ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. దేవాలయ, విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఇతురుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లు, పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. అవసరాలకు ధనం సర్దుబాటు చేసుకోగలుగుతారు. 
 
సింహం : కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దమొత్తం ధనం డ్రా చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారులస్తులక లాభదాయకంగా ఉంటుంది. స్త్రీల కోరికలు, అవసరాలు  నెరవేరుతాయి. 
 
కన్య: బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేకపోతారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తప్పవు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తొందరపాటుతనం వల్ల ఇబ్బందుల్లో పడే ఆస్కారం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత, మెళకువ అవసరం. 
 
తుల: నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. బంధువుల రాక వల్ల పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపు చేయాలనే మీ యత్నం ఫలించదు.  
 
వృశ్చికం: బంధుమిత్రులను విందుకు ఆహ్వానిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలు తలెత్తుతాయి. భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.  
 
ధనస్సు : మిత్రులను విందుకు ఆహ్వానిస్తారు. ఆలయాలకు కానుకలకు సమర్పించుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఫ్యాన్స, సుగంధద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చేకాలం. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం  వంటి శుభఫలితాలుంటాయి. ఒక వేడుకను ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
మకరం: నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. మీ రాక బంధువులకు ఆనందాన్ని ఇస్తుంది. హోటల్, తినుబండారాలు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. ప్రముఖులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : చిన్నారులకు నూతన వస్త్రాలను బహూకరిస్తారు. నిరుద్యోగుల సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.  
 
మీనం: బంధువుల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. మిత్రులతో కలిసి వేడుకలు, విందులలో నిమగ్నులవుతారు. ఆకస్మికంగా ప్రయాణం ప్రయాణం చేయవలసి వస్తుంది. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు తప్పవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-12-17 ఆదివారం రాశి ఫలితాలు